Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఆందోళనల అదుపుకు యోగా అత్యుత్తమ ఔషధం

    Author VENKATESH | 15 Jun 2026, 12:25 PM | EDITORIAL
    ఆందోళనల అదుపుకు  యోగా అత్యుత్తమ ఔషధం

    జూన్ 21న జగమంతా
    యోగతో ఒక్కటౌతుంది
    భారతీయ యోగ విద్యను
    గుండెలకు హత్తుకుంటుంది
    ప్రపంచ దేశాలు ఒకే
    బాటలో నడుస్తాయి

    విశ్వ మానవాళి ఆరోగ్యానికి
    సాధనమైన యోగ విజ్ఞానాన్ని
    అందించిన భారత్ కు
    ప్రపంచ దేశాలు జోహార్లు
    పలుకుతున్నాయి

    ఉరుకుల పరుగుల జీవితంలో
    అలసిన మనసుకు స్వాంతన
    ఇచ్చే యోగ ఆరోగ్య ప్రధాతగా
    పాశ్చాత్య దేశాల్లో గుర్తింపు
    పొందింది

    యోగా ఆందోళన సుడిగుండంలో
    చిక్కుకున్న అన్ని వయసుల
    వారికి ఆత్మీయ నేస్తమై
    మనోప్రశాంతతకు మార్గదర్శి
    అయింది

    యోగతో కంగారు జీవితానికి
    పలకాలి స్వస్తి యోగ సాధన
    నీజీవన శైలి అవుతే మనసు
    కలవరపడదు కలతలు లేని
    కుటుంబాలు ఏర్పడి
    మానసిక ఉద్రిక్తతలు తగ్గుతాయి

    ప్రశాంతతను పెంచే యోగ
    వైపు అడుగులు వేయు
    శ్వాసపై ధ్యాస ఉంచి చేసే
    ప్రాణాయామం మనసులోని
    ఆందోళన కరిగించే అమృతం
    ఆసనాల సాధనతో దేహానికి
    లభించును దృఢత్వం
    ధ్యానంతో చేకూరును
    ఆత్మస్థైర్యం దైవత్వం

    ఆలోచన సునామీని
    ఆపే శక్తే యోగం
    మనసును కమ్మిన
    మబ్బులను తొలిగించి
    మానసిక చైతన్యాన్నిపెంచే
    ఆయుధం యోగాస్త్రం

    మనసులో నిరంతరం ఉప్పొంగే
    ఆలోచనలు ఉద్రేకాలు కోరికలు
    భయాలు ద్వేషాలు అహంకారం
    వాటిని అర్ధం చేసుకొని
    నియంత్రించేది యోగ

    ఇవి కూడా చదవండి

    యోగ కేవలం శారీరక
    వ్యాయామం కాదు
    వ్యక్తిని లోపలి నుండి
    సంస్కరించి
    సమాజంలో సమరసత
    సమన్వయాన్ని పెంచే
    అద్భుతమైన విజ్ఞానం

    వ్యక్తిని సమాజంతో సమాజాన్ని
    మానవత్వంతో మానవత్వాన్ని
    విశ్వ చైతన్యంతో అనుసాధించే
    మార్గం యోగ

    ఒత్తిడిని తరిమికొట్టే
    అత్యుత్తమ ఔషధం యోగ
    అంతరంగ శాంతిని
    మేల్కొలిపే సాధనం యోగ
    నిత్య జీవితాన్ని నందనవనం
    చేసే మంత్రం యోగ

    మనిషి మనసులోని ద్వేషాన్ని
    ప్రేమగా అహంకారాన్ని వినయంగా
    అసూయను ఆనందంగా
    భయాన్ని ధైర్యంగా మార్చగల శక్తి
    యోగా సాధనలోనే ఉంది

    యోగం ఒక ఆంతరంగిక శాస్త్రం
    సాధారణ వ్యక్తిని అసాధారణ
    వ్యక్తిగా తీర్చిదిద్దే మనో విజ్ఞానం
    సమాజాలను మార్చాలంటే
    ముందుగా మనసి చిత్తాలను
    మార్చాలి

    యోగ అలవాటైతే
    రోగాలు థరి చేరవు
    సూర్య నమస్కారాలతో
    పొద్దున లేవాలి
    శరీరంలో కొత్త శక్తిని
    నింపాలి

    కళ్ళు మూసి కాసేపు
    ధ్యానంలో కూర్చుంటే
    కష్టాలన్నీ కరిగిపోతాయి
    యోగకు కులం లేదు
    మతం లేదు యోగా
    అందరిది
    యోగ ఆరోగ్యకరమైన
    సమాజాన్ని నిర్మిస్తుంది
    మన దేశ యోగా ఙ్ఞానాన్ని
    ప్రపంచమంతా చాటుదాం
    అంతర్జాతీయ యోగా దినాన్ని
    ఘనంగా జరుపుకుందాం
    రోజు కొంత సమయం యోగ
    కొరకు కెటాయిద్దాం
    ఆందోళన రహిత జీవితంతో
    ఆనందంగా జీవిద్ధాం

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    ఎకనామిక్ ఫోరం
    సలహాదారులు
    అత్తాపూర్ యోగ సెంటర్
    హైదరాబాద్
    9440245771