Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సమ సమాజ స్థాపన కోసం సిపిఎం పోరాటం

    Author VENKATESH | 12 Jun 2026, 04:07 PM | TELANGANA, నారాయణపేట
    సమ సమాజ స్థాపన కోసం సిపిఎం పోరాటం

    - సిపిఎం జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి

    నారాయణపేట జిల్లా , జూన్ 12 (బి. వి. కే న్యూస్)

    సమాజంలో ధనిక పేదల మధ్య అంతరాన్ని తగ్గించి సమానత్వాన్ని సాధించేందుకు సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి జి వెంకట్రామిరెడ్డి అన్నారు.
    శుక్రవారం రోజు మక్తల్ మండల పరిధిలోని సత్యారం గ్రామంలో సిపిఎం పార్టీ జండా ఆవిష్కరణ చేశారు.
    ఈ సందర్భంగా ఆయన ముఖ్య వక్తగా హాజరై ప్రసంగించారు.
    పేద ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసే పార్టీ సిపిఎం పార్టీ అని అన్నారు .
    అన్యాయానికి వ్యతిరేకంగా పీడనకు, ధోపిడికి వ్యతిరేకంగా పేద ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు.
    విద్య ,వైద్యం ప్రజలకు అందాలని వాటిని వ్యాపార మయంగా చేయొద్దని హితవు పలికారు.
    దేశ సంపదనంతా కొద్దిమంది బడా పారిశ్రామిక వేత్తల పరం చేస్తున్న మన ప్రధానమంత్రి మోడీ వైఖరిని ప్రజలందరూ ఖండించాలని కోరారు.
    దేశ సంపదనంతా బడాపారులకు అప్పజెప్పేందుకు మన ప్రధానమంత్రి మోడీ విధానాలను కొనసాగిస్తున్నారని విమర్శించారు .
    గ్రామాలలో పేదలకు ఉపాధి కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చి విబి జీ రాంజీ కొత్త చట్టంతో పేదలకు ఉపాధి దూరం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
    రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని మద్దతు ధర చట్టం చేయాలని రైతుల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పోరాటం చేస్తున్న నరేంద్ర మోడీ పట్టించుకోవడంలేదని విమర్శించారు.
    భారత రాజ్యాంగాన్ని రక్షించాలని లౌకిక రాజ్యాంగాన్ని కాపాడాలని అందుకు సిపిఎం పార్టీ సమరశీలంగా పోరాటాలు నిర్వహిస్తున్నది అన్నారు .
    సిపిఎం పార్టీలో నీతికి నిజాయితీకి మారుపేరుగలిగిన వాళ్ళు ఉన్న సంగతి ఈడి,మోడి గ్రహించాలని కోరారు.
    కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరాయీ విజయన్ పైన ఈడి దాడులు చేయడం దారుణమని విమర్శించారు.
    సీపీఎం నేతలు మచ్చలేని నాయకులన్నారు.
    దేశంలోనే అత్యంత నిరాడంబరతో నీతి నిజాయితీతో పనిచేస్తున్న నాయకులు మాణిక్ సర్కార్ గతంలో న్రుపెన్ చక్రవర్తి వంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారన్న సంగతి గుర్తించాలన్నారు.
    తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలన్నారు.
    పేదల ఉపాధికి గొడ్డలిపెట్టుగా మారిన విబిజీ రాంజీ చట్టం అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు .
    నారాయణపేట జిల్లాలో రోడ్లన్నీ ధ్వంసమయాయాన్ని వాటిని బాగు చేయాలని డిమాండ్ చేశారు.అంతకుముందు గ్రామములో ర్యాలి నిర్వహించారు
    ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా నాయకులు గోవింద్ రాజు అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుంజనూరు ఆంజనేయులు బండమీది బలరాం,Cpm మక్తల్ నేతలు భరత్,నర్సింహ,బాలు,అశోక్Cpm సోషల్ మీడియా నాయకులు సోఫీ మజార్ సిపిఎం సత్యారం గ్రామ నాయకులు ఆంజనేయులు, రమేష్ కవిత మల్లేష్ చంద్రప్ప బుజ్జప్ప వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి