Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామ యూపీఎస్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ

    Author VENKATESH | 18 Jun 2026, 08:56 PM | TELANGANA, కరీంనగర్
     కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామ యూపీఎస్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ

    కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామంలోని యూపీఎస్ పాఠశాలలో నూతన విద్యా సంవత్సర ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు ఆకాంక్షించారు.
    ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ భాషవేణి సరోజన మల్లేశం యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు.
    కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాలిపెల్లి రవీందర్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
    ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు గ్రామ ప్రముఖులు గ్రామ కార్యదర్శి రాజమల్లయ్య పాలుగోన్నారు

     కరీంనగర్ మండలం చేగుర్తి గ్రామ యూపీఎస్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ - Additional Image