ఆందోళనల అదుపుకు యోగా అత్యుత్తమ ఔషధం

జూన్ 21న జగమంతా యోగతో ఒక్కటౌతుంది భారతీయ యోగ విద్యను గుండెలకు హత్తుకుంటుంది ప్రపంచ దేశాలు ఒకే బాటలో నడుస్తాయి విశ్వ మానవాళి ఆరోగ్యానికి సాధనమైన యోగ విజ్ఞానాన్ని అందించిన భారత్ కు ప్రపంచ దేశాలు జోహార్లు పలుకుతున్నాయి ఉరుకుల పరుగుల జీవితంలో అలసిన మనసుకు స్వాంతన ఇచ్చే యోగ ఆరోగ్య ప్రధాతగా పాశ్చాత్య దేశాల్లో గుర్తింపు పొందింది యోగా ఆందోళన సుడిగుండంలో చిక్కుకున్న అన్ని వయసుల వారికి ఆత్మీయ నేస్తమై మనోప్రశాంతతకు మార్గదర్శి అయింది యోగతో కంగారు జీవితానికి పలకాలి స్వస్తి యోగ సాధన నీజీవన శైలి అవుతే మనసు కలవరపడదు కలతలు లేని కుటుంబాలు ఏర్పడి మానసిక ఉద్రిక్తతలు తగ్గుతాయి ప్రశాంతతను పెంచే...