Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • టీమ్ఇండియా కెప్టెన్లు గిల్, అయ్యర్, మాజీ సారథి సూర్య మధ్యలో ఓ పోలిక- మీరు ఆ పాయింట్ను గమనించారా?

    Author VENKATESH | 15 Jun 2026, 11:49 AM | Sports
    టీమ్ఇండియా కెప్టెన్లు గిల్, అయ్యర్, మాజీ సారథి సూర్య మధ్యలో ఓ పోలిక- మీరు ఆ పాయింట్ను గమనించారా?

    Iyer Surya Gill Captaincy : మరో రెండు వారాల్లో కొత్త కెప్టెన్ నేతృత్వంలో టీమ్ఇండియా టీ20 సిరీస్​ ఆడబోతోంది. ఈ నెల చివరి వారంలో ఐర్లాండ్​తో భారత్ రెండు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో తలపడనుంది. ఇటీవల టీమ్ఇండియాకు కెప్టెన్​గా ఎన్నికైన శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్​లో భారత్​ను నడిపించనున్నాడు. దాదాపు రెండేళ్లు టీ20ల్లో భారత్​ను నడిపించిన సూర్యకుమార్ యాదవ్​ను సెలక్టర్లు ఇటీవల తప్పింది ఆ బాధ్యతలు అయ్యర్​కు అప్పగించారు. దీంతో మాజీ కెప్టెన్ సూర్య, ప్రస్తుత టీమ్ఇండియా సారథులు గిల్, అయ్యర్​ మధ్యలో ఓ పోలిక ఉంది. అందేటంటే?

    ఇదే ఆ పాయింట్!
    ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్​లో వన్డే, టెస్టు ఫార్మాట్లలో శుభ్​మన్ గిల్ టీమ్ఇండియాకు నాయకత్వం వహిస్తుండగా, టీ20ల్లో అయ్యర్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అయితే ఇక్కడ 'సూర్యకుమార్ యాదవ్- శ్రేయస్ అయ్యర్- శుభ్​మన్ గిల్' ముగ్గురిలో ఓ కామన్ పాయింట్ ఉంది. అందేంటంటే? ఈ ముగ్గురు కూడా గతంలో ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్ జట్టుకు ఆడినవాళ్లు. అంతేకాకుండా ఆ ఫ్రాంచైజీ ఈ ఆటగాళ్లను వదులుకున్న తర్వాతే వీళ్లు భారత్​కు కెప్టెన్లుగా ప్రమోట్ అయ్యారు. దీంతో ఈ కామన్ పాయింట్​ను సోషల్ మీడియాలో నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు.

    తొలుత గిల్!
    శుభ్​మన్ గిల్ తన ఐపీఎల్​ కెరీర్​ను కేకేఆర్ జట్టుతోనే ప్రారంభించాడు. రూ.1.8 కోట్లకు కోల్​కతాతో చేరిన అతడు నాలుగు సీజన్లు అంటే 2021 దాకా కేకేఆర్​కే ఆడాడు. అయితే అప్పుడు అతడికి పెద్దగా పేరు దక్కలేదు. ఆ తర్వాత ఏడాది 2022లో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్​తో చేరిన తర్వాత గిల్​ పేరు ఎక్కువగా వినిపించింది. అప్పటికే టీమ్ఇండియాలో యాక్టీవ్ ప్లేయర్​గా ఉండడంతో అతడికి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టెస్టు బాధ్యతలు దక్కాయి. ఇక గతేడాది ఆక్టోబర్​లో రోహిత్ ఉన్నప్పటికీ గిల్​కే వన్డే ఫార్మాట్ నాయకత్వం బాధ్యతలు అప్పగించారు. అలా ప్రస్తుతం ఈ రెండు ఫార్మాట్లకు గిల్ కెప్టెన్​గా కొనసాగుతున్నాడు.

    ఇవి కూడా చదవండి