టీమ్ఇండియా కెప్టెన్లు గిల్, అయ్యర్, మాజీ సారథి సూర్య మధ్యలో ఓ పోలిక- మీరు ఆ పాయింట్ను గమనించారా?
Iyer Surya Gill Captaincy : మరో రెండు వారాల్లో కొత్త కెప్టెన్ నేతృత్వంలో టీమ్ఇండియా టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ నెల చివరి వారంలో ఐర్లాండ్‌తో భారత్ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనుంది. ఇటీవల టీమ్ఇండియాకు కెప్టెన్‌గా ఎన్నికైన శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌లో భారత్‌ను నడిపించనున్నాడు. దాదాపు రెండేళ్లు టీ20ల్లో భారత్‌ను నడిపించిన సూర్యకుమార్ యాదవ్‌ను సెలక్టర్లు ఇటీవల తప్పింది ఆ బాధ్యతలు అయ్యర్‌కు అప్పగించారు. దీంతో మాజీ కెప్టెన్ సూర్య, ప్రస్తుత టీమ్ఇండియా సారథులు గిల్, అయ్యర్ మధ్యలో ఓ పోలిక ఉంది. అందేటంటే?
ఇదే ఆ పాయింట్!
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో వన్డే, టెస్టు ఫార్మాట్లలో శుభ్‌మన్ గిల్ టీమ్ఇండియాకు నాయకత్వం వహిస్తుండగా, టీ20ల్లో అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఇక్కడ 'సూర్యకుమార్ యాదవ్- శ్రేయస్ అయ్యర్- శుభ్‌మన్ గిల్' ముగ్గురిలో ఓ కామన్ పాయింట్ ఉంది. అందేంటంటే? ఈ ముగ్గురు కూడా గతంలో ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ఆడినవాళ్లు. అంతేకాకుండా ఆ ఫ్రాంచైజీ ఈ ఆటగాళ్లను వదులుకున్న తర్వాతే వీళ్లు భారత్‌కు కెప్టెన్లుగా ప్రమోట్ అయ్యారు. దీంతో ఈ కామన్ పాయింట్ను సోషల్ మీడియాలో నెటిజన్లు హైలైట్ చేస్తున్నారు.
తొలుత గిల్!
శుభ్‌మన్ గిల్ తన ఐపీఎల్ కెరీర్‌ను కేకేఆర్ జట్టుతోనే ప్రారంభించాడు. రూ.1.8 కోట్లకు కోల్‌కతాతో చేరిన అతడు నాలుగు సీజన్లు అంటే 2021 దాకా కేకేఆర్కే ఆడాడు. అయితే అప్పుడు అతడికి పెద్దగా పేరు దక్కలేదు. ఆ తర్వాత ఏడాది 2022లో కొత్త ఫ్రాంచైజీ గుజరాత్‌తో చేరిన తర్వాత గిల్ పేరు ఎక్కువగా వినిపించింది. అప్పటికే టీమ్ఇండియాలో యాక్టీవ్ ప్లేయర్‌గా ఉండడంతో అతడికి రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత టెస్టు బాధ్యతలు దక్కాయి. ఇక గతేడాది ఆక్టోబర్‌లో రోహిత్ ఉన్నప్పటికీ గిల్‌కే వన్డే ఫార్మాట్ నాయకత్వం బాధ్యతలు అప్పగించారు. అలా ప్రస్తుతం ఈ రెండు ఫార్మాట్లకు గిల్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.