Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇంటర్​ పాసైన మాజీ మావోయిస్టు దేవ్​జీ - తెలుగు సబ్జెక్టులో ఎన్ని మార్కులొచ్చాయంటే?

    Author VENKATESH | 12 Jun 2026, 12:18 PM | TELANGANA, హైదరాబాద్
    ఇంటర్​ పాసైన మాజీ మావోయిస్టు దేవ్​జీ - తెలుగు సబ్జెక్టులో ఎన్ని మార్కులొచ్చాయంటే?

    లాసెట్​ ప్రవేశ పరీక్షలో సత్తాచాటిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్​జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దేవ్​జీ ఇంటర్​లో ఉత్తీర్ణత సాధించారు. వివరాల్లోకి వెళితే, జగిత్యాల జిల్లాలోని కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి 1980-82లో కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ​(ఎంపీసీ గ్రూపు) చదివారు. అప్పట్లో ఆర్​ఎస్​యూ(రాడికల్ స్టూడెంట్ యూనియన్) భావజాలానికి ఆకర్షితుడై అందులో చేరారు. ఈ క్రమంలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్ష రాయలేకపోయారు. అది మినహా మిగిలిన సబ్జెక్టుల్లో ఆయన ఉత్తీర్ణులయ్యారు.

    ఇంటర్ పరీక్షలో దేవ్​జీ ఉత్తర్ణత : సుదీర్ఘ కాలం పాటు అజ్ఞాతంలో ఉన్న దేవ్​జీ ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటర్​ను పూర్తి చేయాలని భావించారు. ఇందుకోసం పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్​ బోర్డు నుంచి అనుమతిని కూడా పొందారు. తెలుగు పరీక్షను రాశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆయన తెలుగు సబ్జెక్టులో 72 మార్కులను సాధించారు. మొత్తం 614 మార్కులతో ఆయన ఇంటర్ ​పాస్​ అయ్యారు. 34 ఏళ్ల తర్వాత పరీక్ష రాసినా ఆయనకు తెలుగులో 72 మార్కులు రావడం గమనార్హం. ఇటీవలే ఆయన లాసెట్​లో మంచి ర్యాంకు కూడా సాధించిన విషయం తెలిసిందే.