ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు దేవ్‌జీ - తెలుగు సబ్జెక్టులో ఎన్ని మార్కులొచ్చాయంటే?
లాసెట్ ప్రవేశ పరీక్షలో సత్తాచాటిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దేవ్‌జీ ఇంటర్లో ఉత్తీర్ణత సాధించారు. వివరాల్లోకి వెళితే, జగిత్యాల జిల్లాలోని కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి 1980-82లో కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ గ్రూపు) చదివారు. అప్పట్లో ఆర్ఎస్యూ(రాడికల్ స్టూడెంట్ యూనియన్) భావజాలానికి ఆకర్షితుడై అందులో చేరారు. ఈ క్రమంలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్ష రాయలేకపోయారు. అది మినహా మిగిలిన సబ్జెక్టుల్లో ఆయన ఉత్తీర్ణులయ్యారు.
ఇంటర్ పరీక్షలో దేవ్‌జీ ఉత్తర్ణత : సుదీర్ఘ కాలం పాటు అజ్ఞాతంలో ఉన్న దేవ్‌జీ ఇటీవల పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటర్‌ను పూర్తి చేయాలని భావించారు. ఇందుకోసం పరీక్షకు హాజరయ్యేందుకు ఇంటర్ బోర్డు నుంచి అనుమతిని కూడా పొందారు. తెలుగు పరీక్షను రాశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆయన తెలుగు సబ్జెక్టులో 72 మార్కులను సాధించారు. మొత్తం 614 మార్కులతో ఆయన ఇంటర్ పాస్ అయ్యారు. 34 ఏళ్ల తర్వాత పరీక్ష రాసినా ఆయనకు తెలుగులో 72 మార్కులు రావడం గమనార్హం. ఇటీవలే ఆయన లాసెట్‌లో మంచి ర్యాంకు కూడా సాధించిన విషయం తెలిసిందే.