ఇంటర్​ పాసైన మాజీ మావోయిస్టు దేవ్​జీ - తెలుగు సబ్జెక్టులో ఎన్ని మార్కులొచ్చాయంటే?

లాసెట్​ ప్రవేశ పరీక్షలో సత్తాచాటిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్​జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పేరు మరోసారి తెరపైకి వచ్చింది. దేవ్​జీ ఇంటర్​లో ఉత్తీర్ణత సాధించారు. వివరాల్లోకి వెళితే, జగిత్యాల జిల్లాలోని కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి 1980-82లో కోరుట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ​(ఎంపీసీ గ్రూపు) చదివారు. అప్పట్లో ఆర్​ఎస్​యూ(రాడికల్ స్టూడెంట్ యూనియన్) భావజాలానికి ఆకర్షితుడై అందులో చేరారు. ఈ క్రమంలోనే ఇంటర్ సెకండ్ ఇయర్ తెలుగు పరీక్ష రాయలేకపోయారు. అది మినహా మిగిలిన సబ్జెక్టుల్లో ఆయన ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ పరీక్షలో దేవ్​జీ ఉత్తర్ణత : సుదీర్ఘ కాలం పాటు అజ్ఞాతంలో ఉన్న...