Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బడి వైపు ప్రగతి వైపు

    Author VENKATESH | 10 Jun 2026, 12:13 PM | Array
    బడి వైపు ప్రగతి వైపు

    (జూన్12 ప్రపంచ బాలకార్మికుల
    వ్యతిరేక దినోత్సవం సందర్భంగా)

    బడిలో ఉండాల్సిన
    బాలలు పనుల్లో ఉండొద్దు
    ఆటపాటల వయసులో
    పిల్లల హక్కులను
    హరించ వద్దు

    బడి వైపు ప్రగతి వైపు - Additional Image

    చిరునవ్వులు చిందించే
    పెదవులపై చింతల
    నిప్పులు పోయద్దు

    ఆటపాటలతో సాగాల్సిన
    బాల్యాన్ని అంగట్లో
    సరుకుగా మార్చవద్దు
    బడికి వెళ్ళే భాగ్యం లేక
    బతుకు భారమై సాగుతున్న
    బాలల బాల్యాన్ని
    చీకటి గుహగా మార్చద్దు

    పుస్తకాలు పుట్టాల్సిన
    చేతులకు సుత్తెలు
    కొడవళ్ళు గడ్డపారలు
    ఇవ్వద్దు
    పశువుల కాపరిగా
    మార్చద్దు

    బడిబాట పట్టాల్సిన
    పాదాలను బండ చాకిరి
    వైపు నడిపించ వద్దు
    ఇటుక బట్టీల సెగల మధ్య
    కరిగిపోతన్న బాల్యాన్ని
    బడినీడలో రక్షించాలి

    హోటల్లో ప్లేట్లు కడిగి
    శ్రమ దోపిడీకి నలిగిపోతున్న
    రేపటి తరానికి ఆశా వహ
    జీవితాన్ని ఇవ్వాలి

    బాలల కలల రెక్కలను
    తెంచవద్దు వారి ఊహలను
    చిదిమేయ వద్దు
    రసాయనాల ఫ్యాక్టరీ
    పొగల్లో ఊపిరి ఆడని
    బాల్యం ఆకలి కేకలతో
    ఎక్కువ పనిగంటలు
    పనిచేస్తూ కంపెనీల్లో
    బూడిద పాలవుతున్న
    అనారోగ్య బాల భారతం

    ఇవి కూడా చదవండి

    పొగచూరిన ఫ్యాక్టరీల
    గోడలమధ్య పసిప్రాణాలను
    బలిపెట్ట వద్దు

    బాణ సంచా మందు గుండు‌
    తయారీ వెనుక వారి పచ్చని
    బతుకులను కాల్చవద్దు

    అమ్మ ఒడిలో పెరగాల్సిన
    చిన్నారులు ఆనాదాల్లా
    శ్రమిస్తుంటే చూడవద్దు


    అక్షరాల వెలుగులు
    చూడాల్సిన కళ్ళను
    కన్నీటి సముద్రంలో
    ముంచకండి

    బాల్యం అనేది దేవుడి ఇచ్చిన
    వరం దానిని తుంచడం నేరం

    చదువే బాలలకు ఆయుధం
    అదే దేశానికి శ్రీరామరక్ష
    బాల కార్మికుల శ్రమ
    దోపిడీకి చరమగీతం
    పాడుతాం
    బాల కార్మిక నిర్మూలన
    చట్టాలపై అవగాహన
    చైతన్యం పెంచుకుందాం
    బాలకార్మిక రహిత
    సమాజాన్ని నిర్మిద్దాం
    ప్రతి బిడ్డకు చదువుల
    వెలుగులిద్దాం.

    బాలలు బడి వైపు
    సమాజం ప్రగతి వైపు
    వెళ్ళే సామాజిక
    వాతావరణం సృష్టిద్ధాం

    బాలలు రేపటి పౌరులు‌కాదు
    నేటి పౌరులే అన్న స్పృహతో బాలల సర్వతోముఖాభివృద్ధికి
    ప్రభుత్వం పౌరసమాజం
    ఉపక్రమించాలి.

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    (బాలకార్మిక వ్యవస్థ పై
    పరిశోధకులు)
    మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    కరీంనగర్9440245771