బడి వైపు ప్రగతి వైపు
(జూన్12 ప్రపంచ బాలకార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా) బడిలో ఉండాల్సిన బాలలు పనుల్లో ఉండొద్దు ఆటపాటల వయసులో పిల్లల హక్కులను హరించ వద్దు చిరునవ్వులు చిందించే పెదవులపై చింతల నిప్పులు పోయద్దు ఆటపాటలతో సాగాల్సిన బాల్యాన్ని అంగట్లో సరుకుగా మార్చవద్దు బడికి వెళ్ళే భాగ్యం లేక బతుకు భారమై సాగుతున్న బాలల బాల్యాన్ని చీకటి గుహగా మార్చద్దు పుస్తకాలు పుట్టాల్సిన చేతులకు సుత్తెలు కొడవళ్ళు గడ్డపారలు ఇవ్వద్దు పశువుల కాపరిగా మార్చద్దు బడిబాట పట్టాల్సిన పాదాలను బండ చాకిరి వైపు నడిపించ వద్దు ఇటుక బట్టీల సెగల మధ్య కరిగిపోతన్న బాల్యాన్ని బడినీడలో రక్షించాలి హోటల్లో ప్లేట్లు కడిగి శ్రమ దోపిడీకి నలిగిపోతున్న రేపటి తరానికి...