Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జీవితంబంధాల వెలుగు బాధ్యతల పిలుపు

    Author VENKATESH | 06 Jul 2026, 05:48 PM | EDITORIAL
    జీవితంబంధాల వెలుగు బాధ్యతల పిలుపు

    ఓ మనిషి ?
    ఆస్తుల వెనుక పరుగు తీయకు
    ఆత్మీయులను మరువకు
    అంతస్తుల్లో తేడాలు చూపిస్తూ
    అభిమానాలను చంపవద్దు

    కష్టమొస్తే కాపాడే చేతులు
    కావాలి బాధలు పంచుకోవాలి
    బాధ్యతలు పెంచుకోవాలి
    కన్నీళ్ళుతుడిచే బంధువులుండాలి

    ఫోన్ స్క్రీన్ ల లోకం వదిలి
    కలిసి కూర్చొని మాట్లాడాలి
    కలహాలుమాని కులాసాలకు
    వేదిక కావాలి కుటుంబం

    బాధ్యత అంటే కేవలం
    శుభకార్యాలకు రావడం కాదు
    ఆపదలో ఉన్నపుడు అండగా
    నిలబడడం నేను ఉన్నాను
    అనే భరోసా ఇవ్వడం కలిమిలో
    లేమిలో తోడు ఉండడం

    పెద్దల మాటలకు గౌరవమివ్వడం
    తల్లితండ్రులు పిల్లలకు మంచి
    సంస్కారాన్ని నేర్పడం
    బంధువులను పరిచయం
    చేయడం చుట్టరికాల ప్రేమ
    మాధుర్యాలకు పిల్లలను
    చేరువ చేయడంపై శ్రద్ధ
    పెట్టాలి పెద్దరికం ఉనికిని
    చాటాలి

    సుఖాల్లో కలిసి నవ్వడం
    ఎంత ముఖ్యమో
    దుఃఖంలో తోడుగా
    నడవడం అంతే ముఖ్యం

    నిందలు వేసి దూరం కావడం
    కాదు సర్దుకుపోయి బంధాన్ని
    నిలబెట్టడం మన బాధ్యత
    జీవితంలో రాజీ మార్గమే
    నీ రహదారైతే ప్రశాంతత
    నీకు చేరువౌతుంది

    ఇవి కూడా చదవండి

    కలిసి ఉంటే కలదు సుఖం
    అదే కదా అసలైన కుటుంబం
    ద్వేషాల గోడలు కూల్చేద్దాం
    ప్రేమల వంతెన కడదాం
    కలకాలం నిలిచే ఆత్మీయతతో
    కుటుంబ బంధాన్ని కాపాడు
    కుందాం

    ఆస్తులు అంతస్తులు ఈరోజు
    ఉంటాయి రేపు పోతాయి
    కష్ట సుఖాల్లో తోడుండే
    కుటుంబం బంధువులు
    ఎప్పటికీ మనతోనే ఉంటారు

    ఆపదలో ఉన్నపుడు
    ఒకరికి ఒకరు అండగా
    నిలవడం మన బాధ్యత
    చిన్న చిన్న మనస్పర్థలు
    వదిలేసి అహంకారాన్ని
    పక్కన బెట్టి ఆప్యాయతతో
    మనవాళ్లను మనం ప్రేమతో
    గుండెలకు హత్తుకుందాం

    ఉరుకుల పరుగులు జీవితంలో
    ఆత్మీయతను మరువకుండా
    క్షమాపణ అనే ఆయుధంతో
    సర్దుకుపోతూ కుటుంబ
    బంధాన్ని బలోపేతం చేద్దాం

    పెద్దల ఆశీసులు తీసుకుంటూ
    పిల్లలకు ప్రేమానురాగాలు
    పంచుతూ కుటుంబ విలువల
    సంరక్షణా యజ్ఞంలో
    భాగస్వాములమై మన కుటుంబ
    బంధాల భందుత్వాల వెలుగును
    కలకాలం కాపాడుకుందాం

    నవ్వుతూ పలకరిద్దాం
    ప్రేమను పంచుదాం
    మన ఇల్లే కాదు
    ఈ జగమంతా మనదేనంటూ
    "వసుధైక కుటుంబం"గా
    కలిసి నడుద్దాం భారత్ కీర్తి
    ప్రతిష్ఠలు పెంచుదాం.

    (జూలై 7న గ్లోబల్ క్షమాపణ
    దినోత్సవం సందర్భంగా
    కుటుంబ విలువలు భందువులు
    భందుత్వాల పునర్జీవనంపై
    స్పందిస్తూ రాసిన కవిత)

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్9440245771