జీవితంబంధాల వెలుగు బాధ్యతల పిలుపు

ఓ మనిషి ? ఆస్తుల వెనుక పరుగు తీయకు ఆత్మీయులను మరువకు అంతస్తుల్లో తేడాలు చూపిస్తూ అభిమానాలను చంపవద్దు కష్టమొస్తే కాపాడే చేతులు కావాలి బాధలు పంచుకోవాలి బాధ్యతలు పెంచుకోవాలి కన్నీళ్ళుతుడిచే బంధువులుండాలి ఫోన్ స్క్రీన్ ల లోకం వదిలి కలిసి కూర్చొని మాట్లాడాలి కలహాలుమాని కులాసాలకు వేదిక కావాలి కుటుంబం బాధ్యత అంటే కేవలం శుభకార్యాలకు రావడం కాదు ఆపదలో ఉన్నపుడు అండగా నిలబడడం నేను ఉన్నాను అనే భరోసా ఇవ్వడం కలిమిలో లేమిలో తోడు ఉండడం పెద్దల మాటలకు గౌరవమివ్వడం తల్లితండ్రులు పిల్లలకు మంచి సంస్కారాన్ని నేర్పడం బంధువులను పరిచయం చేయడం చుట్టరికాల ప్రేమ మాధుర్యాలకు పిల్లలను చేరువ చేయడంపై శ్రద్ధ పెట్టాలి...