Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాబు జగ్జీవన్ రామ్ సేవలు వెలకట్టలేనివి..

    Author VENKATESH | 06 Jul 2026, 05:47 PM | నారాయణపేట
    బాబు జగ్జీవన్ రామ్ సేవలు వెలకట్టలేనివి..

    - వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు..

    నారాయణపేట,జూలై 6 (బీవీకే న్యూస్)

    భారత స్వాతంత్ర సమరయోధులు, మాజీ ఉప ప్రధాని, భారతదేశ తొలి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా
    మక్తల్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో.. టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ సేవలు వెలకట్టలేనివని, ఆయన జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ అల్కూరి రవి కుమార్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కట్టా సురేష్ గుప్తా, అన్నారు.

    ఇవి కూడా చదవండి

    ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ...

    అట్టడుగు వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన బాబు జగ్జీవన్ రామ్... స్వాతంత్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారని... దేశ స్వాతంత్రం తర్వాత నెహ్రూ హయాంలో ఏర్పడిన తొలి క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారని, అనంతరం దేశ ఉప ప్రధానిగా సైతం సేవలు అందించారని గుర్తు చేశారు. పాకిస్తాన్ తో యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి.. పాకిస్తాన్ ను ఓడించి బంగ్లాదేశ్ కు స్వాతంత్రం సాధించడంలో జగ్జీవన్ రామ్ కీలక భూమిక పోషించారని తెలిపారు.
    వ్యవసాయ శాఖ మంత్రిగాను పనిచేసిన బాబు జగ్జీవన్ రామ్ హరిత విప్లవం తీసుకురావడంలో కీలక చర్యలు చేపట్టారని గుర్తు చేసుకున్నారు. దాదాపు 40 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా వివిధ శాఖల్లో పని చేశారని అన్నారు. చిన్ననాటి నుంచి సాధారణ జీవితం గడిపేందుకు మొగ్గు చూపిన బాబు జగ్జీవన్ రామ్.. ఎందరికో ఆదర్శప్రాయడని .. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అందరం దేశ సేవకు పాటుపడాలని సూచించారు.

    కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డు కౌన్సిలర్ లు, మార్కెట్ డైరెక్టర్ లు, కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.