Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వర్షాకాలపు సమస్యలపై చర్యలేవి రేవంత్

    Author VENKATESH | 05 Jul 2026, 07:37 PM | Array
    వర్షాకాలపు సమస్యలపై చర్యలేవి రేవంత్

    తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో సవాళ్లు ఎక్కిరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చిన్న వర్షం పడినా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మురుగు కాలువల్లో పూడికతీత పనులు ఎక్కడా జరగడం లేదని, చిన్నపాటి వర్షానికే నగరంలోని రోడ్లు చెరువులుగా మారుతున్నాయని చెప్పారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు బస్తీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ (ఆదివారం) పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ప్రారంభించారు.
    ‘ఫిట్ ఇండియా-హెల్త్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా జిమ్‌లను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్‌ను లండన్, సింగపూర్ చేస్తామని గొప్పలు చెప్పాయన్నారు. గత మూడు సంవత్సరాల్లో రేవంత్ ప్రభుత్వం ఆ దిశగా ఎటువంటి ఆచరణాత్మక చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా వర్షాలు తగ్గుతున్నాయనే చర్చ జరుగుతున్న వేళ ప్రతి వర్షపు చుక్కను ఒడిసి పట్టుకోవడం ఎంతో అవసరమన్నారు. నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెట్టే సమయమిదని కేంద్ర మంత్రి సూచించారు.