వర్షాకాలపు సమస్యలపై చర్యలేవి రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో హైదరాబాద్ నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి నగరంలో సవాళ్లు ఎక్కిరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. చిన్న వర్షం పడినా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మురుగు కాలువల్లో పూడికతీత పనులు ఎక్కడా జరగడం లేదని, చిన్నపాటి వర్షానికే నగరంలోని రోడ్లు చెరువులుగా మారుతున్నాయని చెప్పారు. నాంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు బస్తీల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ (ఆదివారం) పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను ప్రారంభించారు. ‘ఫిట్ ఇండియా-హెల్త్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా జిమ్‌లను...