Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జేఎన్‌ఎస్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్‌ శ్వేత

    Author VENKATESH | 03 Jul 2026, 05:04 PM | హన్మకొండ
    జేఎన్‌ఎస్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్‌ శ్వేత

    హనుమకొండ చౌరస్తా, జూలై 3: వరంగల్‌ పోలీస్ కమిషనర్‌ ఎన్‌.శ్వేత శుక్రవారం హనుమకొండలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఇంఛార్జి డీవైఎస్‌వో కొత్త ప్రశాంత్‌ స్టేడియంలోని క్రీడా వసతులను ఆమెకు వివరించారు. అనంతరం కమిషనర్‌ స్టేడియం ఆవరణతో పాటు స్విమ్మింగ్‌ పూల్‌ను పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్​‍ స్కూల్‌ విద్యార్థులతో కమిషనర్‌ కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.
    వారి క్రీడా శిక్షణ, విద్యాభ్యాసం, భవిష్యత్‌ లక్ష్యాల గురించి తెలుసుకుని క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ రాష్ర్ట, జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చాలని ప్రోత్సహించారు.