జేఎన్‌ఎస్‌ను సందర్శించిన పోలీస్ కమిషనర్ శ్వేత
హనుమకొండ చౌరస్తా, జూలై 3: వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత శుక్రవారం హనుమకొండలోని జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా ఇంఛార్జి డీవైఎస్‌వో కొత్త ప్రశాంత్ స్టేడియంలోని క్రీడా వసతులను ఆమెకు వివరించారు. అనంతరం కమిషనర్ స్టేడియం ఆవరణతో పాటు స్విమ్మింగ్ పూల్‌ను పరిశీలించి అక్కడ నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ స్కూల్ విద్యార్థులతో కమిషనర్ కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.
వారి క్రీడా శిక్షణ, విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకుని క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ రాష్ర్ట, జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చాలని ప్రోత్సహించారు.
వారి క్రీడా శిక్షణ, విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకుని క్రమశిక్షణతో శిక్షణ పొందుతూ రాష్ర్ట, జాతీయస్థాయిలో ప్రతిభ కనబర్చాలని ప్రోత్సహించారు.