Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బలూచిస్తాన్‌లో లోయలో పడ్డ బస్సు..

    Author VENKATESH | 03 Jul 2026, 04:52 PM | INTERNATIONAL
    బలూచిస్తాన్‌లో లోయలో పడ్డ బస్సు..

    పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు లోయలో పడటంతో దాదాపు 40 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని, షెరాణి-ఝోబ్ హైవేపై, దానాసర్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. బస్సు క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వెళ్తుండగా పర్వతాలు కలిగిన రోడ్డులో ప్రమాదం జరిగింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఒక బస్సు కెపాసిటీకి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకుని హైవేపై వెళ్తోంది. ఇది సరిహద్దు ప్రాంతాలైన బలూచిస్తాన్, ఖైబర్ పక్తుంఖ్వాలను కలిపే రోడ్డు.
    అయితే, ఈ రోడ్డు చాలా ప్రమాదకరం. పర్వత ప్రాంతం కావడం, రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ అత్యంత ప్రమాదకరమైన రోడ్లలో ఒకటిగా నిలిచింది. అలాంటి ప్రదేశంలో పర్వత మార్గంలో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులు మరణించగా, మరో 8 మంది గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసుల, రెస్క్యూ, వైద్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక చర్యలు ప్రారంభించాయి. బస్సు శిథిలాల నుంచి 40 మంది మృతదేహాల్ని వెలికితీశారు. గాయపడ్డవారిని స్థానిక ఝోబ్ పట్టణంలోని ఆస్పత్రులకు చికిత్స కోసం తరలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రమాద స్తలంలో అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వైద్యబృందం, లైట్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్‌ను అధికారులు సిద్ధం చేశారు.