బలూచిస్తాన్‌లో లోయలో పడ్డ బస్సు..

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు లోయలో పడటంతో దాదాపు 40 మంది మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. ఈ ఘటన బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని, షెరాణి-ఝోబ్ హైవేపై, దానాసర్ ప్రాంతంలో శుక్రవారం జరిగింది. బస్సు క్వెట్టా నుంచి ఇస్లామాబాద్ వెళ్తుండగా పర్వతాలు కలిగిన రోడ్డులో ప్రమాదం జరిగింది. స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఒక బస్సు కెపాసిటీకి మించి ప్రయాణికుల్ని ఎక్కించుకుని హైవేపై వెళ్తోంది. ఇది సరిహద్దు ప్రాంతాలైన బలూచిస్తాన్, ఖైబర్ పక్తుంఖ్వాలను కలిపే రోడ్డు. అయితే, ఈ రోడ్డు చాలా ప్రమాదకరం. పర్వత ప్రాంతం కావడం, రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడం వల్ల...