Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓ మనిషి

    Author VENKATESH | 02 Jul 2026, 04:06 PM | Array
    ఓ మనిషి

    మాటలు వద్దు ఆచరణే ముద్దు
    మనిషి అనుకున్న విజయాలు
    సాధించాలంటే తీసుకునే
    సరైన నిర్ణయాలు మెరుగైన
    అలవాట్లపై ఆధారపడి
    ఉంటాయి
    ప్రతి వ్యక్తి జీవితంలో
    గెలవాలి అని కోరుకుంటాడు
    గెలుపు కొరకు ఏమి చేయాలో
    ఆది చేయడు సాకులు
    వెతుకుతాడు ధైర్యంగా
    ముందుకు సాగడు
    మనం ఏం మాట్లాడుతున్నాం
    అనే దానికంటే రోజు ఏమి
    చేస్తున్నాం అనేదే ముఖ్యం
    ఎందుకంటే మన చేతలే
    మన నిజమైన ఆలోచనలు
    మిగతావన్నీ పై పై మాటలే
    ఓ మనిషి మాటల మూటలు
    విప్పకు సొల్లు కబుర్లతో
    కాలయాపన చేయకు
    చెల్లని రూపాయికి గీతలెక్కువ
    చేతగాని వానికి మాటలెక్కువ
    కోటలు దాటే పలుకులు ఎందుకు?
    చేతల్లో నీ సత్తా చాటని నాడు
    నీ పెదవుల సప్పుడు వ్యర్థం
    ఆకాశం దాకా అబద్ధపు హామీలు
    నీటిపై రాతలౌతాయి సుమా
    ఆచరణలో పెట్టని ఆశయాలన్నీ
    విశ్వసనీయతను దెబ్బతీస్తాయి
    ఎడారిలో ఎండమావులు
    అవుతాయి
    గొప్పలు చెప్పుకుంటే కీర్తి రాదు
    పనియే దైవంగా భావించి
    సరైన టైంలో సరైన ప్రణాళికతో
    కష్టపడి పనిచేస్తేనే గుర్తింపు
    వస్తుంది స్పూర్తిగా నిలుస్తావు
    నీ ప్రవర్తన నీ కార్యశీలత
    నిన్ను చరిత్రలో నిలుపుతుంది
    చెప్పేవాడికి వేదికలు వేలైనా
    ఉంటాయి చెప్పడం సులభం
    అమలుచేయడం కష్టం
    చేసేవాడిక మాత్రమే
    విజయాలు దక్కుతాయి
    వట్టి మాటల వెల్లువ
    వరద లాంటిది
    సత్కార్యాల చలవ
    అమృతం లాంటిది
    మాటల గారడితో
    మనుషులను గెలువలేం
    సంఘ సంస్కర్త గురజాడ
    అప్పారావు రాసిన
    దేశమును ప్రేమించుమన్నా
    దేశభక్తి గేయంలోని
    వట్టి మాటలు కట్టి పెట్టోయ్
    గట్టి మేలు తలపెట్టివోయ్
    సొంత లాభం కొంత మానుకు
    పొరుగు వాడికి తోడుపడవోయ్
    అన్నవాక్యను స్పూర్తిగాతీసుకొని
    జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి
    నిజాయితీ గల పనులతో
    హృదయాలను రంజింపచేయు
    విమర్శల వేడికి వెరగకసాగిపో
    నీనిశ్శబ్దమే నీ గెలుపుకు
    జవాబు ఇస్తుంది
    గొప్పలు చెప్పుకుంటే కీర్తి రాదు
    కష్టపడి పని చేస్తే గుర్తింపు వస్తుంది
    మాటలు కాలంతో కరిగిపోతాయి
    నువ్వు చేసే మంచి పనులే
    చరిత్రలో మిగిలిపోతాయి
    మాటలు కాదు చేతలు ముఖ్యం
    అదేనీవ్యక్తిత్వానికి నిదర్శనం
    ఈరోజునీప్రయాణం మొదలుపెట్టు
    నీ గమ్యాన్ని నీశ్రమతోగెలిచిచూడు
    ఓ మనిషి మాటలు వద్దు
    సమాజ ఉన్నతికి పాటుపడే
    చేతలు ముద్దు ఆచరణే
    ఆయుధం కావాలిపట్టుదలతో
    ప్రగతి పురోగతియే నీ హద్దై
    అభివృద్ధికి దిక్సూచి కావాలి
    నేదునూరి కనకయ్య
    రచయిత
    కాలమిస్ట్
    కరీంనగర్9440245771