Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తప్పనిసరిగా పెరగాలి

    Author VENKATESH | 30 Jun 2026, 10:59 AM | Array
    ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు తప్పనిసరిగా పెరగాలి

    జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక.
    నారాయణపేట, జూన్ 29 (బి వి కే న్యూస్)
    ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల నమోదు (Enrollment) తప్పనిసరిగా పెరగాలని, ప్రతి అర్హత గల బాల బాలిక ప్రభుత్వ పాఠశాలలో చేరేలా మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు.
    జిల్లాలో విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పురోగతిపై కలెక్టర్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
    ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ....
    ప్రభుత్వ భవిత కేంద్రాల నిర్వహణను మరింత బలోపేతం చేసి, ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
    పాఠశాలలకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీని పూర్తిచేయడంతో పాటు, వాటి పంపిణీ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో జాప్యానికి గల కారణాలను తెలుసుకొని, నిర్లక్ష్యం వహించిన సంబంధిత ఎంఈఓలను బాధ్యులను చేయాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు.
    గతంలో కలెక్టర్ నిధులతో మంజూరై పెండింగ్‌లో ఉన్న పాఠశాల అభివృద్ధి పనుల వివరాలను వెంటనే సేకరించి, ఇంజినీరింగ్ విభాగం ద్వారా ఆయా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్ని నిధులు కేటాయించారు? ఎన్ని పనులు పూర్తి అయ్యాయి? ఇంకా ఎన్ని పనులు పెండింగ్ లో ఉన్నాయి? బిల్లులు మంజూరైనా చేయని పనులు ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలతో తనకు నివేదిక తయారు చేసి ఇవ్వాలని ఆదేశించారు. ఇక ఎఫ్‌ఆర్‌ఎస్‌ (FRS) అమలులో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. హాజరు నమోదు చేయని ఉపాధ్యాయులకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, అలాగే సోమవారం అత్యల్ప హాజరు నమోదైన నారాయణపేట, మాగనూరు, నర్వ మండలాల ఎంఈఓల నుంచి సంజాయిషీ కోరాలని జిల్లా విద్యాశాఖాధికారిని ఆదేశించారు.
    అలాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, ప్రీ-ప్రైమరీ పాఠశాలల ప్రారంభం, సెంట్రలైజ్డ్ కిచెన్, అపార్ ఐ డీ నమోదు, ఆధార్ అనుసంధానం కార్యక్రమాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
    ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాభివృద్ధి కోసం నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి, విద్యా కార్యక్రమాల సమర్థ అమలుపై అవసరమైన శిక్షణలు ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారికి సూచించారు.
    ఈ సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి డా. ఎం. గోవిందరాజులు, ఏఎంఓ విద్యాసాగర్, సెక్టోరల్ అధికారులు నాగార్జున రెడ్డి, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.