Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భారీ వర్షాలు, వరదలపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి

    Author VENKATESH | 29 Jun 2026, 08:26 PM | ములుగు
    భారీ వర్షాలు, వరదలపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి

    * ముంపు కుటుంబాలకు మూడు నెలల రేషన్, గర్భిణీలు–వృద్ధుల తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలి
    * డీడీఆర్‌ఎఫ్ బృందాలు, పడవలు, లైఫ్ జాకెట్లు అన్నింటిని సిద్ధంగా ఉంచాలి
    * పునరావాస కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలి
    * ప్రాణ, ఆస్తి రక్షణకు జిల్లా యంత్రాంగం పూర్తి సంసిద్ధంగా ఉండాలి
    * విపత్తు నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం
    * జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు.
    ములుగు జిల్లా ప్రతినిధి,
    జూన్ 29 (బివికె 3 న్యూస్):
    వర్షాకాలంలో సంభవించే భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, విపత్తు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు.
    సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ హాల్లో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్‌తో కలిసి భారీ వర్షాలు, వరదలు, విపత్తు నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
    వరద ప్రభావిత కుటుంబాలను ముందుగానే గుర్తించి మూడు నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని జూలైలోనే అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ముంపునకు గురయ్యే ఇళ్ల జాబితా సిద్ధం చేయడంతో పాటు గర్భిణీలు, వృద్ధులను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని సూచించారు.
    లో-లెవెల్ కల్వర్టులు, వాగులు, గోదావరి పరివాహక ప్రాంతాలు, ప్రమాదకర మార్గాలను నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. భారీ వర్షాల సమయంలో ప్రజలకు వెంటనే హెచ్చరికలు జారీ చేస్తూ, పోలీసు–రెవెన్యూ–స్థానిక సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
    పునరావాస కేంద్రాల్లో తాగునీరు, ఆహారం, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, బ్లీచింగ్, యాంటీ లార్వా మందులు తదితర అన్ని సౌకర్యాలు ముందుగానే సిద్ధంగా ఉంచాలని సూచించారు.
    మేడారం, ఏటూరునాగారం ప్రాంతాల్లో డీడీఆర్‌ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచడంతో పాటు పడవలు, లైఫ్ జాకెట్లు, నైలాన్ తాళ్లు, ఇతర సహాయక సామగ్రిని అవసరమైన ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ప్రత్యేక కమ్యూనికేషన్ గ్రూపులు ఏర్పాటు చేయాలని సూచించారు. జలపాతాలు ఉద్ధృతంగా ప్రవహించే సమయంలో పర్యాటకులను అనుమతించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
    ఈ సమావేశంలో ఐటిడిఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి., సంపత్ రావు, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్వో రవికుమార్, డీఎస్పీ రవీందర్, జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.