Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫిర్యాదు దారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

    Author VENKATESH | 29 Jun 2026, 08:20 PM | ములుగు
    ఫిర్యాదు దారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

    * ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దు
    - ప్రజావాణిలో 81 దరఖాస్తుల స్వీకరణ
    - భూ సమస్యలకు సంబంధించిన 26 వినతులు నమోదు
    - నిర్దిష్ట గడువులో అన్ని ఆర్జీల పరిష్కారానికి ఆదేశాలు
    * అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హె.చ్ మహేందర్ జి.
    ములుగు జిల్లా ప్రతినిధి,
    జూన్ 29 (బీవీకే 3 న్యూస్):
    ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారులు సమర్పించిన ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు.
    ఈ కార్యక్రమంలో మొత్తం 81 దరఖాస్తులు అందాయి. వాటిలో ఇందిరమ్మ ఇండ్లకు 18, పెన్షన్లకు 9, భూ సమస్యలకు 26, ఇతర శాఖలకు సంబంధించిన 28 దరఖాస్తులు నమోదయ్యాయి.
    ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి వినతిని ప్రాధాన్యంగా తీసుకుని సంబంధిత శాఖ అధికారులు నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
    ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సంపత్ రావు, ఆర్డీవో కృష్ణవేణి, డీఆర్వో రవికుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు