ఫిర్యాదు దారుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలి

* ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావివ్వొద్దు - ప్రజావాణిలో 81 దరఖాస్తుల స్వీకరణ - భూ సమస్యలకు సంబంధించిన 26 వినతులు నమోదు - నిర్దిష్ట గడువులో అన్ని ఆర్జీల పరిష్కారానికి ఆదేశాలు * అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హె.చ్ మహేందర్ జి. ములుగు జిల్లా ప్రతినిధి, జూన్ 29 (బీవీకే 3 న్యూస్): ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారులు సమర్పించిన ప్రతి అర్జీని సత్వరమే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సి.హెచ్. మహేందర్ జి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 81 దరఖాస్తులు...