Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు

    Author VENKATESH | 25 Jun 2026, 04:44 PM | EDITORIAL
    డ్రగ్స్ వద్దు  జీవితమే ముద్దు

    (జూన్ 26 డ్రగ్స్ వ్యతిరేక
    దినోత్సవం సందర్భంగా)

    ఓ యువత మేలుకో
    మత్తు చల్లే మాయలో పడకు
    పచ్చని జీవితాన్ని బలిచేసుకోకు
    డ్రగ్స్ విషవలయంలో చిక్కుకొని
    కన్న వారి కన్నీటికి కారణం కాకు

    క్షణకాలం మత్తు కోసం
    జీవితాన్ని నరకం చేసుకోకు
    నీ ఆలోచనే దేశానికి భలం
    యువ శక్తే జాతీయ శక్తి

    డ్రగ్స్ వినియోగం సమాజానికి
    దురాచారంగా ప్రభలింది
    చదువుల గుడిలో డ్రగ్స్ భూతం
    చేరింది ముక్కు పచ్చలారని
    చిన్నారుల జీవితాలను
    చిదిమేసింది

    యువత ఉజ్వల భవిష్యత్తును
    బూడిద పాలు చేసింది
    ఆలోచనల పదునును
    మొద్దుబార్చేఈవ్యసనం
    జీవచ్ఛవాల్లుగా మార్చే
    ఒక మానసిక నరకం

    సిరల్లో ప్రవహించాలి ప్రగతి రక్తం
    కానీ సిరంజీల గుచ్చులతో
    శుష్కించి పోతుంది శరీరం
    కన్న వారి కలలు కరిగిపోతుంటే
    మౌనమెందుకు?
    జాతి యువ వనరులు
    నాశనమౌతుంటే నిర్లక్ష్యం
    ఎందుకు?

    డ్రగ్స్ కేంద్ర నాడీ వ్యవస్థ
    పైప్రభావం చూపి మనిషిని
    దీర్ఘకాలిక అనారోగ్య
    సమస్యల పాలు చేస్తుంది

    జీర్ణ వ్యవస్థ దెబ్బతిని
    శరీరం శుష్కిస్తుంది
    లివర్ పై ఒత్తిడి పెరిగి
    పనిచేయని స్థితి వస్తుంది
    గుండె వేగంలో మార్పులు
    వస్తాయి గుండెపోటుతో
    మరణాలు సంభవిస్తాయి

    జ్ఞాపక శక్తి క్షీణిస్తుంది
    ఒత్తిడి పెరిగి ఏకాగ్రత
    హింసాత్మక ఆలోచనలు
    పురుడు పోసుకోని
    ప్రగతిని అడ్డుకుంటుంది
    మెదడు దెబ్బతిని
    మూర్ఛ వ్యాధి వస్తుంది

    60 ఏళ్ల క్రితమే మనుషులు
    మత్తుకు మరిగినట్లు చరిత్ర
    చెబుతుంది
    గంజాయి హీరోయిన్ వివిధ
    రూపాల్లో లభించే డ్రగ్స్
    పిల్లలు యువత విచ్చల
    విడిగా వినియోగించి
    డ్రగ్స్ బారిన పడి తమ
    బంగారు భవిష్యత్తును
    పాడు చేసుకుంటున్నారు

    ఇవి కూడా చదవండి

    కుటుంబ పెద్దలు పిల్లలపై
    నిఘా పెట్టాలి వారితో గడపాలి
    వారి నిరాశను అలసటను
    ప్రేమతో పలకరించాలి

    తల్లి తండ్రులు తమ పిల్లలకు
    స్నేహితుడై నిలిచి నేను ఉన్నాను
    అనే భరోసా భద్రత వాతావరణం
    సృష్టించాలి

    ప్రతి అడుగున అండగా నిలవాలి
    మనసులోని మాటలు వినాలి
    ఒత్తిడిని దూరం చేసే ఇల్లే
    ఒకధైర్యపు కోట అనే నమ్మకం
    ఇవ్వాలి

    డ్రగ్స్ అనే మహమ్మారిని
    అడ్డుకోవాలంటే
    యుద్ధం ప్రతి ఇంటి నుండే
    మొదలవ్వాలి
    డ్రగ్స్ పట్ల తల్లి తండ్రుల
    జాగరూకతే దేశానికి రక్షణ
    కవచం కావాలి

    డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో
    కుటుంబమే కీలక సూత్రధారి
    పిల్లలు మత్తుకు బానిస కాకుండా
    తల్లితండ్రులు మమతల కోటలు
    కట్టాలి

    డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు
    కుటుంభమే‌ వేదిక కావాలి
    తల్లి తండ్రులే పిల్లల భవిష్యత్తుకు
    బంగారు బాటలు వేయాలి

    ఓ యువతా మత్తును
    వీడు ప్రగతిని చూడు
    మత్తువద్దు జీవితమే ముద్దు
    ఓ యువత మేలుకో
    ఉజ్వల భవిష్యత్తును
    ఏలుకో

    వ్యసనాల సంకెళ్లు తెంచి
    ప్రగతి బాట పడదాం
    మత్తులేని నవ సమాజాన్ని
    గర్వంగా నిర్మిద్దాం

    ఓయువతా డ్రగ్స్ రహిత
    సమాజ స్థాపనకు నడుం కట్టు
    ఆరోగ్య భారత్ లక్ష్యంగా
    ముందుకు సాగిపో

    రెండు తెలుగు రాష్ట్రాల్లో
    ప్రభుత్వాలు డ్రగ్స్ నిర్మూలనకు
    ఈగల్ అనే పేరుతో ప్రత్యేక
    కార్యాచరణ ప్రవేశ పెట్టడం
    అభినందనీయం.

    నేదునూరికనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    మాజీ ఎన్ ఎస్ ఎస్ అధికారి
    మాజీ కరెస్పాండెంట్
    జస్టిస్ కుమారయ్య లా కాలేజీ

    కరీంనగర్
    9440245771