డ్రగ్స్ వద్దు జీవితమే ముద్దు

(జూన్ 26 డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా) ఓ యువత మేలుకో మత్తు చల్లే మాయలో పడకు పచ్చని జీవితాన్ని బలిచేసుకోకు డ్రగ్స్ విషవలయంలో చిక్కుకొని కన్న వారి కన్నీటికి కారణం కాకు క్షణకాలం మత్తు కోసం జీవితాన్ని నరకం చేసుకోకు నీ ఆలోచనే దేశానికి భలం యువ శక్తే జాతీయ శక్తి డ్రగ్స్ వినియోగం సమాజానికి దురాచారంగా ప్రభలింది చదువుల గుడిలో డ్రగ్స్ భూతం చేరింది ముక్కు పచ్చలారని చిన్నారుల జీవితాలను చిదిమేసింది యువత ఉజ్వల భవిష్యత్తును బూడిద పాలు చేసింది ఆలోచనల పదునును మొద్దుబార్చేఈవ్యసనం జీవచ్ఛవాల్లుగా మార్చే ఒక మానసిక నరకం సిరల్లో ప్రవహించాలి ప్రగతి రక్తం కానీ సిరంజీల గుచ్చులతో శుష్కించి...