Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ఉద్యమిద్దాం

    Author VENKATESH | 25 Jun 2026, 04:43 PM | EDITORIAL
    డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ఉద్యమిద్దాం

    (డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్దు)

    డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచానికి సామాజిక సమస్యగా పరిణమించింది. దేశ అభివృధిలో చోదక శక్తిగా నిలిచిన యువత డ్రగ్స్ ఆల్కహాల్ మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని తమ శక్తి సామర్ధ్యాలు నిర్వీర్యం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం యువత వినాశన కరంగ మారింది ఆశలు ఆకాంక్షలు కన్న కలలు విచ్చిన్నమై కుటుంబాలలో ఆనందకరమైన జీవితానికి అవరోధం కావడం శోచనీయం.
    చరిత్ర
    ‌ఐ'రా'స ‌జూన్26 న ప్రపంచ డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపాలని 1987 నుండి ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం అరికట్టేందుకు సభ్య దేశాల ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీచేస్తూ మాదక ద్రవ్యాల మహమ్మారికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తుంది. . డ్రగ్స్ మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాల వినియోగం రావాణా వల్ల ఏర్పడే దుష్ఫలితాల పట్ల ప్రజలకు పౌరసమాజానికి అవగాహన చైతన్యం కలిగించడం ముఖ్య ఉద్దేశం పత్రికల్లో మీడియాలో డ్రగ్స్. మాదక ద్రవ్యాల వినియోగం వార్తలు సమాజాన్ని కలవర పెడుతున్నాయి.
    డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుంది
    ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుంది. చిన్న పట్టణాల నుంచి మెట్రోపాలిటన్ నగరాలకు డ్రగ్స్ వ్యాపారం మూడు పువ్వులు అరవై‌ కాయలుగా కొనసాగుతుంది స్కూల్ కాలేజీ యూనివర్సిటీలు డ్రగ్స్.విక్రయ కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. డ్రగ్స్ మాదక ద్రవ్యాల వ్యాపారం మాఫియా యువతను నిర్వీర్యం చేస్తూ లక్షల కోట్ల చీకటి వ్యాపారం చేస్తున్నాయి. యువత మత్తు కు ఆకర్షితులై మత్తు నుండి బయట పడలేక తమ జీవితాలను బలిచేసుకుంటున్నారు. కొంత మంది ఆత్మహత్యలకు పాల్పదుతున్నరు.
    పెరిగిన డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 269 మిలియన్ల మంది మాదక ద్రవ్యాలకు బానిస అయ్యారని నివేదికలు వెల్లడించాయి. వీరే కాకుండా ఎప్పుడైన ఒకసారి వినియోగించేవారు 5.5% మంది ఉన్నారు. దేశంలో మద్యం వినియోగించే వారు16 కోట్ల మంది గంజాయి 3.1 కోట్లు హీరోయిన్ 2.8 కోట్లు కోకైన్ ఇతర మత్తుపదార్తాలు 1.18 కోట్ల మంది వాడుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి. డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా 2004లో 21 శాతం వాడుతుంటే నేడు 29.5% పెరిగిందని యు'ఎన్'ఓ'డి'సి విడుదల చేసిన నివేదిక తెలిపింది .ఈ నివేదిక ప్రకారం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ప్రపంచ వ్యాప్తంగా అర మిలియను మంది 2019లో మరణిస్తే ఇండియాలో జరిగిన ఆత్మహత్యల్లో ఎక్కువ శాతం ఈ కోవకు చెందినవేనని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు ఉపయోగించే వారు 0.71 శాతం ఉంటే ప్రపంచ సగటు కంటే ఎక్కువగా మన దేశంలో 2.65% ఈ ప్రమాదకరమైన డ్రగ్స్ వాడుతున్నారని నివేదిక పేర్కొంది 1985లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్ స్టాన్సెస్ చట్టం ప్రకారం మాదద్రవ్యాలు కలిగి ఉండటం సరఫరా ఉత్పత్తి చట్టరీత్యా నేరం అయినప్పటికీ ఈరోజు మనదేశంలో విచ్చల విడిగా డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. వాడకం పెరుగుతుంది ఇంతటి ప్రమాదకరమైన సమస్య రోజురోజు కు తీవ్రమవుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. దీని కోసం తక్షణ పరిష్కారం కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి.
    నిరంతర అప్రమత్తత
    డ్రగ్స్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం డ్రగ్గ్స్ అక్రమ రవాణా కు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలు ఒక రోజు కాకుండా నిరంతరం జరగాలి. వీటివల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలి. ఈ సమస్య పరిష్కరించడానికి సమర్థవంతమైన పాలన చట్టబద్ధమైన విధానాలను రూపొందించాలి. ప్రభుత్వాలు స్థానిక సంస్థలు మహిళా సంఘాలు పౌర సమాజం స్వచ్చంధ సంస్థలు మాదక ద్రవ్యాలకు సంబంధించిన చట్టాలు కార్యక్రమాలు పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలి .డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగ వ్యతిరేక సమాచారాన్ని పంచుకోవాలి మాదకద్రవ్యాలు సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యవస్థలు ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు విద్యావేత్తలు సమిష్టిగా కృషి చేయాలి. ఒక్కరోజు మాత్రమే దీని గురించి ఆలోచించి మర్చిపోకూడదు. అక్రమ రవాణా ఎదుర్కోవడానికి అంతర్జాతీయంగా దేశాల మధ్యన సహకారం అవసరం. వ్యక్తులు కుటుంబాలు సమాజాలపై మాదకద్రవ్యాల దుర్వినియోగం గురించి అవగాహన చైతన్యం కలిగించాలి .నివారణ చికిత్స పునరావా స కార్యక్రమాలను ప్రోత్సహించాలి . మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో ప్రజలందరూ సంపూర్ణ భాగస్వాములై డ్రగ్స్ రహిత సమాజం యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయాలి . వర్క్ షాపలు సదస్సులు చర్చలు ఏర్పాటు చేయాలి. మత్తు పదార్థాలు కు‌ వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తులను సంస్…