డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ఉద్యమిద్దాం
(డ్రగ్స్ వద్దు ఆరోగ్యం ముద్దు) డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచానికి సామాజిక సమస్యగా పరిణమించింది. దేశ అభివృధిలో చోదక శక్తిగా నిలిచిన యువత డ్రగ్స్ ఆల్కహాల్ మాదక ద్రవ్యాల మత్తులో చిక్కుకొని తమ శక్తి సామర్ధ్యాలు నిర్వీర్యం చేసుకుంటున్నారు. డ్రగ్స్ మాదక ద్రవ్యాల దుర్వినియోగం యువత వినాశన కరంగ మారింది ఆశలు ఆకాంక్షలు కన్న కలలు విచ్చిన్నమై కుటుంబాలలో ఆనందకరమైన జీవితానికి అవరోధం కావడం శోచనీయం. చరిత్ర ఐ'రా'స జూన్26 న ప్రపంచ డ్రగ్స్ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపాలని 1987 నుండి ప్రపంచ వ్యాప్తంగా డ్రగ్స్ మాదక ద్రవ్యాల వినియోగం అరికట్టేందుకు సభ్య దేశాల ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీచేస్తూ...