Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సానుభూతి వద్దు సమాన గౌరవం ముద్దు

    Author VENKATESH | 23 Jun 2026, 07:24 PM | EDITORIAL
    సానుభూతి వద్దు సమాన గౌరవం ముద్దు

    (జూన్23 న ప్రపంచ
    వితంతు దినోత్సవం )
    ________
    భర్త మరణిస్తే భార్య నుదుట
    ఉన్న బొట్టు పోతేనేమి
    ఆమె గుండెల్లో ఆశలు
    చచ్చిపోవు కదా?

    చేతికున్న గాజులు
    పగిలిపోతే నేమి
    మనుషులపై మమకారం
    చెరిగిపోదుకదా?
    భర్తను కోల్పోవడం
    ఆమె తప్పు కాదు

    లోకం ఆమెను
    పాపాత్మురాలిగా
    చూడడం అన్యాయం

    కట్టుకున్న వాడు
    కానరాని లోకాలకు పోతే
    కన్నవారే ఆమెను దూరం
    పెట్టడం ధర్మమా?

    పండుగ వస్తె చాలు
    ఆమెను గదిలో దాచేస్తారు
    శుభకార్యం జరిగితే
    ఆమె నీడను పడనీయరు

    నలుగురిలోకి వస్తే
    అపశఖనం అంటూ
    నిందిస్తారు
    సమాజం కళ్ళు ఆమెను
    నిలువునా ధహించేస్తాయి

    ఇవి కూడా చదవండి

    రంగు రంగుల
    హైటెక్ యుగంలో
    (ఎ ఐ యుగంలో)
    ఆమెకు తెల్లని చీర శిక్షా?
    నవ్వడం కూడా నేరంగా
    భావించే సమాజ
    వాతావరణం ఉంది

    ఆమె కన్నీళ్లు ఎవరికి
    శాపాలు కావు సమాజ
    చూపులే అమెకు
    నిత్య గాయాలు

    ఆమె కూడా ఒక అమ్మే కదా
    ఒక కూతురే కదా
    మనలాగే రక్త మాంసం
    ఉన్న మనిషే కదా
    మనసు ఉన్న మనిషే కదా

    ఆమె నవ్వులో ఎందుకంత
    వివక్ష
    ఆమె ఒంటరి తనానికి
    ఎందుకీ సామాజిక శిక్ష
    చదువుకుంది ఆమె
    సంపాదించగలదు ఆమె
    ఈ దేశాన్ని మార్చే శక్తి
    కూడా ఉంది ఆమెకు

    కానిమూఢ నమ్మకాల కట్టుబాట్ల
    మధ్య ఆమె బతుకు ఒక
    ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది

    ఇకనైనా మారుద్దాం మన సంకుచిత ఆలోచనలను తెంచుకుందాం
    ఆ పాత కాలపు మూఢ
    సంకెళ్ల నుండి విముక్తి
    కల్పిద్దాం
    ఆమె జీవితంలో మళ్లీ
    రంగులను నింపుదాం

    కొత్త ఆశలతో ఆమెను
    ముందుకు నడిపిద్దాం
    ఆమెకు స్వేచ్ఛ వుంది
    స్వేచ్ఛగాబతికే హక్కుఉంది
    ఆమెకు కావాలి
    సమాజంలో సమాన
    గౌరవం
    ఆమెను కూడా మనలో
    ఒకరిగా ఆదరిద్దాం

    మానవత్వంతో
    కొత్తలోకాన్ని నిర్మిద్దాం
    సమాజంవితంతువులకు
    సామాజిక గౌరవంన్యాయం
    విద్య ఆర్థిక భద్రత కల్పించాలి

    వితంతువుల ఆర్థిక
    స్వావలంబనకు సామాజిక
    మద్దతునిచ్చి దేశాభివృద్ధిలో
    భాగస్వాములను చేద్దాం
    ఆమె నుదుట ధైర్యమనే
    బొట్టుపెట్టిముందుకు సాగేలా
    ప్రోత్సాహిద్దాం

    వితంతువు అనేది ఒక శాపం కాదు
    అది కేవలం ఒక పరిస్థితి మాత్రమే
    బొట్టు గాజులు రంగు చీరలు
    మనిషిజీవితాన్ని శాసించే లేవు
    సాంప్రదాయాల పేరుతో ఒక
    మహిళను మానసికంగా
    చంపడం అమానుషం
    సమాజం మారాలి ప్రతి
    మహిళ ఆత్మ గౌరవంతో
    బతికే సమానహక్కును
    అందించాలి
    మార్పు మన ఇంటి
    నుంచే మొదలు కావాలి

    నేదునూరి కనకయ్య
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్9440245771