సానుభూతి వద్దు సమాన గౌరవం ముద్దు
(జూన్23 న ప్రపంచ వితంతు దినోత్సవం ) ________ భర్త మరణిస్తే భార్య నుదుట ఉన్న బొట్టు పోతేనేమి ఆమె గుండెల్లో ఆశలు చచ్చిపోవు కదా? చేతికున్న గాజులు పగిలిపోతే నేమి మనుషులపై మమకారం చెరిగిపోదుకదా? భర్తను కోల్పోవడం ఆమె తప్పు కాదు లోకం ఆమెను పాపాత్మురాలిగా చూడడం అన్యాయం కట్టుకున్న వాడు కానరాని లోకాలకు పోతే కన్నవారే ఆమెను దూరం పెట్టడం ధర్మమా? పండుగ వస్తె చాలు ఆమెను గదిలో దాచేస్తారు శుభకార్యం జరిగితే ఆమె నీడను పడనీయరు నలుగురిలోకి వస్తే అపశఖనం అంటూ నిందిస్తారు సమాజం కళ్ళు ఆమెను నిలువునా ధహించేస్తాయి రంగు రంగుల హైటెక్ యుగంలో (ఎ ఐ యుగంలో) ఆమెకు...