Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భయంతో వచ్చిన రోగి, చిరునవ్వుతో ఇంటికి వెళ్లడమే మా లక్ష్యం: బాలకృష్ణ

    Author VENKATESH | 23 Jun 2026, 12:22 PM | ANDHRA PRADESH
    భయంతో వచ్చిన రోగి, చిరునవ్వుతో ఇంటికి వెళ్లడమే మా లక్ష్యం: బాలకృష్ణ

    పేదలకు అండగా ఉండాలనే లక్ష్యంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్ ప్రారంభమైందని ఆసుపత్రి ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రోజుకి 35 నుంచి 45 శస్త్రచికిత్సలు చేస్తున్నామని వేలాది మందికి ఇది ఓ ఆశాకిరణమని చెప్పారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జ్యూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి సత్యకుమార్​తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

    ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ తాను నటుడిగానో, ఎమ్మెల్యేగానో తాను రాలేదని ఓ కొడుకుగా మీ ముందు నిలుచున్నానని అన్నారు. 1984వ సంవత్సరంలో తమ తల్లి బసవతారకం క్యాన్సర్ బారిన పడినప్పుడు తాము ఎంతో బాధపడ్డామని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె కేవలం తన ఆరోగ్యం కోలుకోవడం గురించే కాదు, చికిత్సకయ్యే ఖర్చుల గురించీ మా అమ్మ ఆందోళన చెందారని బాలకృష్ణ చెప్పారు.

    ఆ ప్రశ్నే మా బాధ్యతను గుర్తుచేసింది : తమకు డబ్బు ఉంది కాబట్టి గట్టిగా పోరాడగలిగామని, అయితే డబ్బు లేని వారు ఈ వ్యాధితో ఎలా పోరాడుతారని తమ తల్లి ప్రశ్నించారని ఆయన పేర్కొన్నారు. అప్పుడే ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు. తమ తల్లి వేసిన ఆ ప్రశ్నే తమ కుటుంబ బాధ్యతను గుర్తు చేసిందని, దాంతో తమ తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) ఆ ప్రశ్నను ఒక గొప్ప లక్ష్యంగా తీసుకున్నారని బాలకృష్ణ తెలిపారు.

    ఇవి కూడా చదవండి

    కేవలం సరైన చికిత్స అందుబాటులో లేదనే కారణంతో ఒక్క ప్రాణం కూడా పోకూడదనే పట్టుదలతో మా నాన్న1989లోనే ఈ సంస్థకు పునాది వేశారని బాలకృష్ణ వెల్లడించారు. ఇప్పటివరకు దాదాపు 3.75 లక్షల మందికి ఓపీ సేవలు అందించామన్నారు. బాధతో ఆసుపత్రికి వచ్చే వారు నవ్వుతూ తిరిగి వెళ్లాలి అనేదే తమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. భారత్​లోనే మొట్ట మొదటి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కేంద్రాన్ని అప్పట్లోనే ప్రారంభించామని ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తు చేశారు.

    డబ్బులేక ఏ ఒక్కరూ క్యాన్సర్‌ చికిత్సకు దూరం కాకూడదు : ఈ సుదీర్ఘ ప్రయాణంలో ప్రభుత్వాలు ఎంతగానో సహకరించాయన్నారు. ఎన్నో సంస్థలు, దాతలు మాకు అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క రోగి కూడా క్యాన్సర్‌ చికిత్సకు దూరం కాకూడదన్నదే తమ ధ్యేయమని చెప్పారు. 25 ఏళ్ల క్రితం తాము చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నామని, భవిష్యత్తులోనూ దీనిని ఇలాగే కొనసాగిస్తామని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. ఇందులో భాగంగానే రాబోయే రోజుల్లో అమరావతిలో నూతనంగా క్యాన్సర్‌ ఆసుపత్రిని నిర్మిస్తామని, అదేవిధంగా హైదరాబాద్‌లోని సేవలను మరింత విస్తరిస్తామని బాలకృష్ణ అన్నారు.