భయంతో వచ్చిన రోగి, చిరునవ్వుతో ఇంటికి వెళ్లడమే మా లక్ష్యం: బాలకృష్ణ

పేదలకు అండగా ఉండాలనే లక్ష్యంతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్​స్టిట్యూట్ ప్రారంభమైందని ఆసుపత్రి ఛైర్మన్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. రోజుకి 35 నుంచి 45 శస్త్రచికిత్సలు చేస్తున్నామని వేలాది మందికి ఇది ఓ ఆశాకిరణమని చెప్పారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జ్యూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి సత్యకుమార్​తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ తాను నటుడిగానో, ఎమ్మెల్యేగానో తాను రాలేదని ఓ కొడుకుగా మీ ముందు నిలుచున్నానని అన్నారు. 1984వ సంవత్సరంలో తమ తల్లి...