Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఫిఫా ప్రపంచ కప్: లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు నోట్!

    Author VENKATESH | 22 Jun 2026, 12:15 PM | Sports
    ఫిఫా ప్రపంచ కప్: లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు నోట్!

    ఫిఫా ప్రపంచ కప్‌లో ఇరాన్ జట్టు ప్లేయర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ సహ ఆతిధ్య దేశం అమెరికా.. కొందరు ఇరాన్ ప్లేయర్ల వీసా అనుమతి నిరాకరించింది. దీనివల్ల మ్యాచ్ ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకునే అవకాశమే లేకుండా దేశాన్ని వదిలి వెళ్లాల్సి వస్తోంది. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ 2-2తో డ్రా అవ్వగా.. తాజాగా బెల్జియం జట్టుతో ఇరాన్ మ్యాచ్ 0-0తో డ్రా అయింది. లాస్ ఏంజెలెస్‌లోని సోఫీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అనంతరం ఇరాన్ ప్లేయర్లు భావోద్వేగంతో ఓ లేఖ రాసి లాకర్ రూమ్‌లో వదిలి వెళ్లారు.
    ప్రాచీన పర్షియా నుంచి ఇప్పటి ఇరాన్ వరకు మా దేశ ప్రజల వ్యక్తిత్వం స్థిరంగానే ఉంది. ఈ టోర్నీలో లాస్ ఏంజెలెస్‌కు వచ్చి గౌరవంగా పోటీ పడ్డాం. సగర్వంగా ఇక్కడి నుంచి వెళ్తున్నాం. మీ ఆతిథ్యానికి ధన్యవాదాలు. ఈ మ్యాచ్ జరిగిన 180 నిమిషాల పాటు మాకు మద్దతుగా నిలిచిన ఇరాన్ అభిమానులకు కృతజ్ఞతలు. అన్ని దేశాల మధ్య శాంతి, స్నేహం ఉండాలి’ అని ఇరాన్ ప్లేయర్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే #168, #minab అనే హ్యాష్‌ట్యాగ్‌లు కూడా ఈ లేఖలో ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌లో జరిగిన సంఘటనలను సూచించే ఈ హ్యాష్‌ట్యాగ్‌లు రాజకీయ భావోద్వేగాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయి.