ఫిఫా ప్రపంచ కప్: లాకర్ రూమ్‌లో ఇరాన్ జట్టు నోట్!
ఫిఫా ప్రపంచ కప్‌లో ఇరాన్ జట్టు ప్లేయర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ సహ ఆతిధ్య దేశం అమెరికా.. కొందరు ఇరాన్ ప్లేయర్ల వీసా అనుమతి నిరాకరించింది. దీనివల్ల మ్యాచ్ ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకునే అవకాశమే లేకుండా దేశాన్ని వదిలి వెళ్లాల్సి వస్తోంది. న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్ 2-2తో డ్రా అవ్వగా.. తాజాగా బెల్జియం జట్టుతో ఇరాన్ మ్యాచ్ 0-0తో డ్రా అయింది. లాస్ ఏంజెలెస్‌లోని సోఫీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ అనంతరం ఇరాన్ ప్లేయర్లు భావోద్వేగంతో ఓ లేఖ రాసి లాకర్ రూమ్‌లో వదిలి వెళ్లారు. ప్రాచీన పర్షియా నుంచి ఇప్పటి ఇరాన్ వరకు మా...