Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఒలంపిక్ డే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

    Author VENKATESH | 20 Jun 2026, 05:48 PM | EDITORIAL
    ఒలంపిక్ డే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

    - పెద్ద ఎత్తున క్రీడాభిమానులు తరలి రండి

    - పిలుపునిచ్చిన ఒలంపిక్ డే పరుగు నిర్వాహన కమిటీ చైర్మన్ బి.గోపాలం

    నారాయణపేట జిల్లా, జూన్ 20( బి వి కె న్యూస్ )

    ఇవి కూడా చదవండి

    తెలంగాణ రాష్ట్ర ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఏపీ. జితేందర్ రెడ్డి ,పి. మల్లారెడ్డి ఆదేశాల మేరకు జూన్ 23 న,40వ ఒలంపిక్ డే రన్ ను పురస్కరించుకొని, నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 21న ఆదివారం నిర్వహించే ఒలంపిక్ డే రన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి క్రీడాభిమాని తరలిరావాలని ఒలంపిక్ డే పరుగు నిర్వాహన కమిటీ చైర్మన్ బి.గోపాలం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
    21వ తేదీ ఉదయము 7 గంటలకు మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్ నుండి పురవీధుల గుండా ఘనంగా ఒలంపిక్ డే రన్ ను నిర్వహిస్తున్నామని ఒలంపిక్ డే పరుగు నిర్వాహన కమిటీ చైర్మన్ బి.గోపాలం, కన్వీనర్లు సి. అబ్రేషన్, విష్ణువర్ధన్, దామోదర్ తెలిపారు.

    ఈ ఒలంపిక్ డే పరుగులో విద్యార్థులు, క్రీడాకారులు, పిడి,పిఈటిలు యువతీ యువకులు, క్రీడాభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది క్రీడా సంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఒలంపిక్ డే రన్ ను విజయవంతం చేయాలని ఒలంపిక్ డే రన్ నిర్వాహణ కమిటీ చైర్మన్ బి.గోపాలం, కన్వీనర్లు సి. అమ్రేష్, విష్ణువర్ధన్, దామోదర్ పిలుపునిచ్చారు.