Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాల్పుల విరమణకు తూట్లు..

    Author VENKATESH | 20 Jun 2026, 02:14 PM | INTERNATIONAL
    కాల్పుల విరమణకు తూట్లు..

    ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన గంటల వ్యవధిలోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ వైమానిక, డ్రోన్ దాడుల్లో కనీసం ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.
    లెబనాన్‌లోని నబతియెహ్ ప్రాంతంలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ ఘటనలో అనేక నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో శాంతి నెలకొంటుందని ఆశించిన స్థానికుల్లో తాజా దాడులు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఇక.. ఈ దాడులకు ముందు రాత్రి కూడా అదే ప్రాంతంలో భారీ బాంబుదాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.
    అమెరికా, ఖతార్, ఇరాన్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధికారులు ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ అగ్రీమెంట్ అమల్లోకి వచ్చిందన్నారు. దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడం, పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ఊతమివ్వడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అయితే.. ఒప్పందం అమల్లోకి రాగానే దాడులు కొనసాగడం వల్ల శాంతి ప్రక్రియపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశమున్నట్టు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.