కాల్పుల విరమణకు తూట్లు..
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన గంటల వ్యవధిలోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ వైమానిక, డ్రోన్ దాడుల్లో కనీసం ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. లెబనాన్‌లోని నబతియెహ్ ప్రాంతంలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ ఘటనలో అనేక నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో శాంతి నెలకొంటుందని ఆశించిన స్థానికుల్లో తాజా దాడులు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఇక.. ఈ దాడులకు ముందు రాత్రి కూడా అదే ప్రాంతంలో భారీ బాంబుదాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు....