Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నెతన్యాహు ఓ యోధుడిలాంటి ప్రధాని.. డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు.

    Author VENKATESH | 20 Jun 2026, 12:48 PM | INTERNATIONAL
    నెతన్యాహు ఓ యోధుడిలాంటి ప్రధాని.. డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు.

    లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన్ను యోధ ప్రధానమంత్రిగా అభివర్ణించారు.
    వాషింగ్టన్ సమీపంలో ఖతార్ కానుకగా ఇచ్చిన నూతన ఎయిర్‌ఫోర్స్ వన్ విమాన ఆవిష్కరణ అనంతరం ట్రంప్ మాట్లాడారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య చక్కటి పోరాటం జరిగిందన్నారు. 'నిస్సందేహంగా మేం ఇజ్రాయెల్‌తో చాలా బాగా పోరాడాం. ఆ దేశంతో మాకు గొప్ప సంబంధాలున్నాయి. మేము చాలా శక్తిమంతంగా ఉన్నాం. ఇక బీబీ(నెతన్యాహు).. ఓ యోధుడి లాంటి ప్రధానమంత్రి. ఆయన్ను అలాగే గుర్తించాలి. ఆ ఘనత ఆయనకు దక్కాల్సినదే' అని ట్రంప్ పేర్కొన్నారు. లెబనాన్‌లో ఇజ్రాయెల్ యుద్ధాన్ని కొనసాగించాలని ఆ దేశ ప్రధాని తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ట్రంప్ ఈ రకంగా వ్యాఖ్యానించడం గమనార్హం.
    ఇక.. లెబనాన్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను, ముఖ్యంగా లెబనాన్‌పై జరగబోయే దాడుల విషయమై ట్రంప్ ప్రస్తావిస్తూ.. అలాంటి నిర్ణయాలపై నియంత్రణ అవసరమన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు టెహ్రాన్‌తో ఒప్పందం కుదిరినప్పటికీ.. లెబనాన్‌లో ఇరాన్ మద్దతుగల హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న పోరాటం పట్ల ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ సంభాషణలోనూ ఆయన నెతన్యాహునుద్దేశించి.. 'నీవు పిచ్చివాడివి. నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి. నేనే నిన్ను కాపాడుతున్నాను' అని మాట తూలిన సంగతి తెలిసిందే.