నెతన్యాహు ఓ యోధుడిలాంటి ప్రధాని.. డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు.
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహుపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన్ను యోధ ప్రధానమంత్రిగా అభివర్ణించారు. వాషింగ్టన్ సమీపంలో ఖతార్ కానుకగా ఇచ్చిన నూతన ఎయిర్‌ఫోర్స్ వన్ విమాన ఆవిష్కరణ అనంతరం ట్రంప్ మాట్లాడారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అమెరికా, ఇజ్రాయెల్‌ల మధ్య చక్కటి పోరాటం జరిగిందన్నారు. 'నిస్సందేహంగా మేం ఇజ్రాయెల్‌తో చాలా బాగా పోరాడాం. ఆ దేశంతో మాకు గొప్ప సంబంధాలున్నాయి. మేము చాలా శక్తిమంతంగా ఉన్నాం. ఇక బీబీ(నెతన్యాహు).. ఓ...