Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్కూల్ టైం" పిల్లల్లోనూ కనిపించని ఒత్తిడి - పేరెంట్స్ బాధ్యతలు తెలుసుకోవాల్సిందే!

    Author VENKATESH | 18 Jun 2026, 11:55 AM | EDITORIAL
    స్కూల్ టైం" పిల్లల్లోనూ కనిపించని ఒత్తిడి - పేరెంట్స్ బాధ్యతలు తెలుసుకోవాల్సిందే!

    ఒత్తిడి అనేది కేవలం పెద్దవాళ్లనే కాదు, పిల్లలను కూడా వేధిస్తోన్న మానసిక సమస్య. ఈ రోజుల్లో స్కూల్​కు వెళ్లే పిల్లలు కూడా వివిధ కారణాల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి తగిన పరిష్కారం చూపాలంటున్నారు నిపుణులు. లేదంటే, ఇది వారి ఎదుగుదల పైనే ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల్లో ఒత్తిడి దరి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం!

    ఆటలాడిస్తున్నారా? : మారుతోన్న జీవనశైలిలో భాగంగా చాలామంది పిల్లలకు బయటకు వెళ్లి ఆటలాడుకునే సమయం, వెసులుబాటు దొరకడం లేదు. ఎప్పుడు చూసినా చదువు/ హోమ్​వర్క్, ట్యూషన్లు అంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇక సండే లేదా హాలిడే వచ్చినా, కాస్త ఖాళీ సమయం దొరికినా చాలా మంది మొబైల్​ఫోన్​లోనే ఆటలు ఆడేస్తూ దాన్నే ప్రపంచం అనుకుంటున్నారు. ఈ అలవాట్లే పిల్లల్లో ఒత్తిడికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే, రోజూ సాయంత్రం ఓ గంట సేపు పిల్లలతో ఆటలాడించడం మంచిదని సూచిస్తున్నారు. తద్వారా వారిలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయట. ఇవి ఒత్తిడిని దూరం చేసి సంతోషంగా ఉండేలా చేస్తాయి. అలాగే, ఇవి సహజ సిద్ధ నొప్పి నివారిణులుగానూ పనిచేస్తాయి. ఇలా ఆటలతో పాటు డ్యాన్సింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి వాటిని వారి జీవనశైలిలో భాగం చేస్తే సానుకూల ఫలితం ఉంటుంది.