స్కూల్ టైం" పిల్లల్లోనూ కనిపించని ఒత్తిడి - పేరెంట్స్ బాధ్యతలు తెలుసుకోవాల్సిందే!

ఒత్తిడి అనేది కేవలం పెద్దవాళ్లనే కాదు, పిల్లలను కూడా వేధిస్తోన్న మానసిక సమస్య. ఈ రోజుల్లో స్కూల్​కు వెళ్లే పిల్లలు కూడా వివిధ కారణాల వల్ల ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ సమస్యను ముందుగానే గుర్తించి తగిన పరిష్కారం చూపాలంటున్నారు నిపుణులు. లేదంటే, ఇది వారి ఎదుగుదల పైనే ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల్లో ఒత్తిడి దరి చేరకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం! ఆటలాడిస్తున్నారా? : మారుతోన్న జీవనశైలిలో భాగంగా చాలామంది పిల్లలకు బయటకు వెళ్లి ఆటలాడుకునే సమయం, వెసులుబాటు దొరకడం లేదు. ఎప్పుడు చూసినా చదువు/ హోమ్​వర్క్, ట్యూషన్లు అంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇక సండే...