Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అనిల్ రావిపూడి-వెంకటేశ్- కల్యాణ్ రామ్ కొత్త సినిమా షురూ- హీరోయిన్లు కన్ఫర్మ్

    Author VENKATESH | 18 Jun 2026, 11:22 AM | Array
    అనిల్ రావిపూడి-వెంకటేశ్- కల్యాణ్ రామ్ కొత్త సినిమా షురూ- హీరోయిన్లు కన్ఫర్మ్

    అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్- నందమూరి కల్యాణ్​ రామ్​ కాంబోలో కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్​ ఈరోజు అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్​లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని లాంఛనంగా మొదలైంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఎంపికైయ్యారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 సంక్రాతికి విడుదల చేయాలని అనిల్ భావిస్తున్నారు.

    ఈ కార్యక్రమానికి హీరోలు వెంకటేశ్, కల్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి హాజరైయ్యారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు సురేశ్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దిల్​రాజు స్క్రిప్ట్ అందించగా, వెంకటేశ్ కృతి శెట్టి, కీర్తి సురేశ్, కల్యాణ్​ రామ్​పై అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. అనంతరం మూవీటీమ్ గ్రూప్​ ఫొటో దిగింది.