Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ధ్యానం ఆందోళన అదుపుకు దివ్యౌషధం

    Author VENKATESH | 17 Jun 2026, 04:00 PM | EDITORIAL
    ధ్యానం ఆందోళన  అదుపుకు దివ్యౌషధం

    (జూన్21న 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా)

    ఆధునిక మానవ జీవితం శాస్త్ర సాంకేతికంగా ఎంత ముందుకు వెళుతున్నప్పటికీ అంతకంటే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురౌతుంది. ఉరుకుల పరుగుల జీవితం పోటీ ప్రపంచం ఉద్యోగ వ్యాపారాల్లో సవాళ్లు మనిషిని
    నిరంతరం ఆందోళన ఒత్తిడి వైపు
    నెట్టుతున్నాయి. మానసిక రుగ్మతల నుండి ఉపశమనం పొందేందుకు ధ్యానం గొప్ప ఆయుధం. మానసిక ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకోవడానికి వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీఅన్నింటికంటేసహజమైన సురక్షితమైన రూపాయి ఖర్చు లేని ఏకైక మార్గం ధ్యానం.
    ధ్యానం శారీరక మానసిక
    ఆరోగ్యానికి దివ్యౌషధం
    ప్రాచీన కాలము నుండి భారతదేశంలో ఋషులు మునులు ఆచరించిన జీవన విధానమే ధ్యానం. యోగ ధ్యానం నేడు ప్రపంచ వ్యాప్తంగా మానసిక శారీరకఆరోగ్యానికి ఒక దివ్యఔషదంగా శాస్త్రీయంగా నిరూపించబడింది.
    ధ్యానం మొదట్లో కష్టం అనిపించిన తర్వాత ధ్యాన సాధన ధ్యానం సామర్ధ్యాన్నిపెంచుతుంది .ధ్యానం చేయడం వల్ల గతాన్ని మర్చిపోయి వర్ధమానజీవితంలోముందుకుసాగడానికి కావలసిన సామర్థ్యాన్ని సమకూర్తుంది.
    సాకులు వద్దు ధ్యానం ముద్దు
    నాకు ధ్యానం చేయడానికి సమయం లేదు. చేయాలని ఉంది వీలు కావడం లేదు ధ్యానం నేను చేయలేను అని చాలా మంది సాకులు చెబుతారు. ఇక్కడ చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ చాతగానివానికి మాటలు ఎక్కువ అనే సామెత గుర్తుకొస్తుంది. నాకు శ్వాస తీసుకోవడానికి సమయం లేదని ఎవరు చెప్పరు. శ్వాస తీసుకోకపోతేమనిషి జీవించలేడు .సంపూర్ణ ఆరోగ్యానికి యోగ ధ్యానం ప్రాణాయామం ముఖ్యమైనవి
    ఈ మూడు మానవుణ్ణి అన్ని రకాల వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి.
    ఆందోళనలు ధ్యానం
    ఆందోళన కలిగినప్పుడు మెదడులో ఆలోచనల వేగం విపరీతంగా పెరుగుతుంది. భవిష్యత్తు గురించి భయం గతం గురించిన నిరాశ మనిషిని చుట్టుముడుతాయి.
    ఈ స్థితిలో మెదడులో ఫైట్ అర్ ఫ్లైట్ వ్యవస్థయాక్టివేట్అవుతుంది.
    దీనిని ధ్యానం ద్వారా అదుపు చేయవచ్చును.
    కార్టిసోల్ హార్మోన్ నియంత్రణ
    ఒత్తిడి సమయంలో శరీరంలో కార్టిసోల్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ధ్యానంచేయడం వల్ల
    ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది.
    ఆల్ఫా తరంగాల ఉత్పత్తి
    ధ్యానంలో ఉన్నపుడు మెదడులో ఆల్ఫా తరంగాలు ఉత్తేజితమై మనసుకు ప్రశాంతత స్థిరత్వాన్ని చేకూరుస్తాయి.
    ధ్యానం ప్రస్తుత క్షణం పై దృష్టి
    ప్రస్తుతక్షణంపైదృష్టి పెడుతుంది. ధ్యానం మనల్ని గతం నుండి భవిష్యతు నుండి తప్పించి ప్రస్తుత క్షణం మీద దృష్టిపెట్టేలా చేస్తుంది. ధ్యానం వల్ల అనవసరపు భయాలు ఊహలు అనుమానాలు తొలిగిపోతాయి.
    ధ్యానం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
    ధ్యానం కేవలం మానసిక ప్రక్రియ మాత్రమే కాదు .శారీరక వ్యవస్థ మొత్తాన్ని సమతుల్యతలోకి తెస్తుంది.
    రక్తపోటు(BP) నియంత్రణ
    ధ్యానం వల్ల నరాల వ్యవస్థ బలపడి రక్తనాళాలు రిలాక్స్ కావడం వల్ల రక్త ప్రసరణను సాఫీగా మార్చుతుంది .అధిక రక్తపోటును తగ్గిస్తుంది.
    గుండె ఆరోగ్యం మెరుగు
    ధ్యానం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి గుండెపై అదనపు బారం తగ్గుతుంది. ధ్యానం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
    రోగనిరోధక శక్తిపెరుగుతుంది
    నిరంతర ధ్యానం చేసే వారిలో వ్యాధినిరోధక శక్తి కణాలు చురుకుగా పనిచేస్తాయి. ధ్యానంవల్ల శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ వైరస్ ల బారి నుండి రక్షిస్తుంది.

    దీర్ఘకాలిక నొప్పుల నుంచి ఉపశమనం
    ధ్యానం వల్ల కీళ్ల నొప్పులు మైగ్రేన్ తలనొప్పి వెన్ను నొప్పి లాంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ధ్యానం సహజ నివారిణిగా పనిచేస్తుంది. నొప్పిని భరించే మానసిక స్థితిని ఇస్తుంది.

    తీవ్రమైన నిరాశ నివారణ
    నిరంతరం ధ్యానం చేయడం వల్ల ప్రతికూల ఆలోచనలతో బాధపడే వారిలో ధ్యానం సానుకూల దృక్పథాన్ని నింపుతుంది. డిప్రెషన్
    తగ్గుతుంది. మానసిక కుంగుపాటు తగ్గుతుంది.ఏకాగ్రత్త పెరుగుతుంది.
    ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతుంది
    ఉద్యోగులకు విద్యార్థులకు ధ్యానం ఉపయోగపడుతుంది.ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరిగి తార్కికత పరిశోధన పరిశీలన సామర్థ్యాన్ని పెంచుతుంది.
    నిద్ర లేమి వారికి ధ్యానం ఒక వరం. ధ్యానం ఆలోచన రహిత స్థితికి తీసుకు వెళ్ళి హాయిగా ప్రశాంతంగా నిద్రపట్టేట్లు చేస్తుంది.
    భావోద్వేగాల నియంత్రణ
    చిన్న విషయాలకే కోపానికిరావడం చిరాకు పడడం ఏడవడం లాంటి భావోద్వేగాలను అదుపుచేస్తుంది . ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనిషిలో స్థితప్రజ్ఞతతో వ్యవహరించే శక్తి పెరుగుతుంది.
    వ్యసనాల నుండి విముక్తి
    ధ్యానం వల్ల ఆత్మవిశ్వాసం స్వయం నియంత్రణ శక్తి పెరుగుతుంది. ధూమపానం మద్యపానం డ్రగ్స్అబ్యూస్ మితిమీరిన డిజిటల్ ఎడిక్ట్ లాంటి చెడు అలవాట్ల నుండి బయటపడడానికి ధ్యానం మానసిక బలాన్ని ఇస్తుంది.

    ఇవి కూడా చదవండి

    ధ్యానం శాంతి
    ధ్యానం శాంతి కరుణ ఐక్యత పరోపకారం సహకారం సహనం పెంచి పోషించడంలో
    శక్తివంతమైన సాధనం.
    ధ్యానం గొప్ప ఆయుధం
    సమాజంలో సామరస్యం సమరసత సంఘీభావం సమతా మమత మానవీయ విలువలపై చైతన్యం కలిగించి స్థిరమైన ప్రపంచాన్ని నిర్మించడానికి ధ్యానం గొప్ప ఆయుధం.
    గుణాత్మక మార్పులు

    ధ్యానం మనిషి శారీరక మానసిక ఆరోగ్యంలో గుణాత్మక మార్పులు తెస్తుంది.
    ధ్యానం వల్ల సమయ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచి మనసుకు తక్షణమే శక్తిని అందిస్తుంది. ధ్యానం మనిషిని ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగుతున్న ఒత్తిడి ఆందోళన క్షీణిస్తున్న సంబంధాలు విశ్వాసం నమ్మకం సమాజంలో పెంచుతుంది. సామరస్యం సంపూర్ణ ఆరోగ్యాన్నిఇస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. సమాజంలో క్షీణిస్తున్న మానవీయ విలువలు విశ్వాసం పరస్పర సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఆధునిక సాంకేతిక సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతుంది ధ్యానం. మనసుకు స్పష్టతనిస్తుంది. భావా వేశాల నియంత్రణ జరిగి ధ్యానంతో పాటు మెరుగైన మానసిక స్థిరత్వం ఏర్పడుతుంది.
    ఆధునిక ప్రపంచ సవాళ్లకు పరిష్కారం
    ధ్యానం శాంతి సామరస్యం అంతరంగిక శాంతిని కలిగిస్తుంది. మనసుకు ప్రశాంతతను చేకూరుస్తుంది.ఆధునిక ప్రపంచంలో ఏర్పడుతున్న పలు సంక్షోభాలకు సవాళ్లకు పరిష్కారం చూపిస్తుంది.
    ధ్యానం _సవాళ్లకు పరిష్కారం
    ధ్యానం మానసిక ఒత్తిడి హింసను తగ్గిస్తుంది. సంఘర్షణలకు పరిష్కారం చూపిస్తుంది. సమాజంలో క్షీణిస్తున్న మానవీయ విలువలు విశ్వాసం పరస్పర సంబంధాలను మెరుగు పరుస్తుంది.
    ఆథునిక సాంకేతిక 'సామాజిక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ధ్యానం మనసుకు స్పష్టత భావావేశాల నియంత్రణ జరిగి ధ్యానంతో ఆటుపోట్లను తట్టుకునేశక్తిపెరుగుతుంది .
    ధ్యానం _మందు
    సామాజిక సామరస్యతకు ఆందోళన అదుపుకు ధ్యానము దివ్య ఔషధం. ధ్యానంతో మెరుగైన మానసిక ఆరోగ్య జీవనశైలి ఏర్పడుతుంది. సానుకూల మానసిక స్థితి ఆరోగ్యకరమైన నిద్ర శక్తినిపెంచుతుంది. చిత్తవైకల్యం తగ్గిస్తుంది. ధ్యానం ఆధునిక ప్రపంచ సవాళ్లను పరిష్కరించే ఆయుధం.
    ధ్యానంమానవీయ విలువలను పెంచుతుంది
    ధ్యానము మానవీయ విలువలను పెంచుతుంది. మనషుల మమనసుల్లో పేరుకుపోయిన భేద భావాలను అధిగమించి మమతా మానవత్వం శాంతి సహనం
    పరిమళించే విధంగా ధ్యానం ఉపయోగపడుతుంది .
    ధ్యానం సంస్కృతుల అవగాహన
    ధ్యానం జాతుల మధ్య వివిధ సంస్కృతతులపట్ల అవగాహన గౌరవం దేశాల మధ్య భౌగోళిక ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి జాతుల మధ్య సంస్కృతి విశ్వాసాల రక్షణ భద్రత పట్ల అవగాహన గౌరవం ఏర్పడడానికి కావలసిన సమగ్రమైన పరిష్కారాన్ని ధ్యానం చూపిస్తుంది.
    ధ్యానం పాఠ్యాంశం
    నూతన విద్యావిధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలో కళాశాలలో ధ్యానం యోగ ప్రాణాయామం పాఠ్యాంశంగా ప్రవేశపెట్టాలి.
    మానసిక ఒత్తిడి తగ్గించాలి
    విద్యార్థులకు చదువుల వల్ల కలుగుతున్న మానసిక ఒత్తిడిని తగ్గించే తక్షణ చర్యలు ప్రభుత్వం చేపట్టాలి. యువత మనోబలాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచిపోషించే అధ్యయనము అభ్యసనము ప్రతిని ప్రవేశపెట్టాలి. సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ప్రణాళికలు అమలు చేయాలి.
    ధ్యాన కేంద్రాలు కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి
    ధ్యానంతో హింసా రహిత సమాజ నిర్మాణంలో పౌర సమాజం వ్యాపార వర్తక సంస్థలు కార్పొరేట్ కంపెనీలు సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు యోగా ధ్యానం ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడానికి ధ్యాన కేంద్రాలను కౌన్సిలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక గంట ధ్యానం చేసే విధంగా పని గంటలు నిర్ణయించే విధి విధానాలు అమలుచేయాలి.
    ధ్యానంతో సుస్థిరాభివృద్ధి లక్ష్య సాధన
    సమాజంలో సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ కొరకుఊతంగా నిలిచే ధ్యానాన్ని ఐరాస నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఉపకరించే దీర్ఘకాలిక వ్యూహాలను అమలు చేయాలి .
    ధ్యానం సామాజిక ఉద్యమం
    ధార్మికసంస్థలు స్వచ్ఛంద సంస్థలు సామాజిక సేవ సంస్థలు మహిళా సంఘాలు యువత మీడియా ధ్యానం యొక్క ప్రాముఖ్యతను ఒక సామాజిక ఉద్యమంగా కొనసాగించడంలో క్రియాశీల పాత్ర పోషించాలి. యోగ సాధనలో అంతర్జాతీయ గుర్తింపులో ముందున్న భారత్ ధ్యానాన్ని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి మార్గదర్శిగా నిలిచి భారత్ విశ్వ గురువుగా ఎదగాలని ఆశిద్దాం.

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    సలహాదారులు
    అత్తాపూర్ యోగ సెంటర్
    హైదరాబాద్
    9440245771