ధ్యానం ఆందోళన అదుపుకు దివ్యౌషధం
(జూన్21న 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా) ఆధునిక మానవ జీవితం శాస్త్ర సాంకేతికంగా ఎంత ముందుకు వెళుతున్నప్పటికీ అంతకంటే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురౌతుంది. ఉరుకుల పరుగుల జీవితం పోటీ ప్రపంచం ఉద్యోగ వ్యాపారాల్లో సవాళ్లు మనిషిని నిరంతరం ఆందోళన ఒత్తిడి వైపు నెట్టుతున్నాయి. మానసిక రుగ్మతల నుండి ఉపశమనం పొందేందుకు ధ్యానం గొప్ప ఆయుధం. మానసిక ఆరోగ్య స్థితిని మెరుగుపరుచుకోవడానికి వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీఅన్నింటికంటేసహజమైన సురక్షితమైన రూపాయి ఖర్చు లేని ఏకైక మార్గం ధ్యానం. ధ్యానం శారీరక మానసిక ఆరోగ్యానికి దివ్యౌషధం ప్రాచీన కాలము నుండి భారతదేశంలో ఋషులు మునులు ఆచరించిన జీవన విధానమే ధ్యానం. యోగ ధ్యానం నేడు ప్రపంచ...