Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ధాన్యం కొనాలని రోడ్డెక్కిన రైతులపై కేసులు

    Author VENKATESH | 16 Jun 2026, 01:21 PM | TELANGANA
    ధాన్యం కొనాలని రోడ్డెక్కిన రైతులపై కేసులు

    కష్టపడి పండించి పంటలను కొనాలని కోరడమే కాంగ్రెస్‌ పాలనలో నేరమవుతున్నది. ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులపై పోలీసులు కుట్రపూరితంగా కేసులు నమోదు చేసస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో గత నెల 20న ధాన్యం కొనాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన రైతులపై పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా కేసులు నమోదు చేశారు. నెల రోజులైనా కాంట వేయడం లేదని కాంట అయిన బస్తాలను తరలించడం లేదని ఆరోపిస్తూ గొల్లపల్లిలో రోడ్డుపై ధాన్యం బస్తాలతో నిరసన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సులోచన, నెన్నెల ఎస్ఐ రామకృష్ణ రైతులను సముదాయించి ఆందోళన విరమింప చేయడానికి యత్నించారు.
    అంతకు ముందు రైతులకు తహసిల్దార్ సైతం ధాన్యం కాంట చేసి లారీలను పంపుతామని ఫోన్‌లో చెప్పడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. అంతా అయిపోయిందని రైతులు భావించారు. కానీ పోలీసులు మాత్రం రైతులపై గుట్టుచప్పుడు కాకుండా మూడు వారాలు దాటాక ఆరుగురు రైతులపై కేసు నమోదు చేసారు. చింత పురుషోత్తం, జాడి నారాయణ, గడ్డం తిరుపతి గౌడ్, చింత సురేష్, ఇందూరి రమేష్, వేల్పుల మొగిలి పై 126(2),221,292 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసారు. చింత సురేష్ స్థానికంగా లేకున్నా పోలీసులు ఆయన పై కేసు పెట్టారు. పోలీసులు రైతులపై అక్రమ కేసులు పెట్టడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుననాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.