ధాన్యం కొనాలని రోడ్డెక్కిన రైతులపై కేసులు
కష్టపడి పండించి పంటలను కొనాలని కోరడమే కాంగ్రెస్ పాలనలో నేరమవుతున్నది. ధాన్యం కొనుగోలు చేయాలని నిరసన తెలిపిన రైతులపై పోలీసులు కుట్రపూరితంగా కేసులు నమోదు చేసస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో గత నెల 20న ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసిన రైతులపై పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా కేసులు నమోదు చేశారు. నెల రోజులైనా కాంట వేయడం లేదని కాంట అయిన బస్తాలను తరలించడం లేదని ఆరోపిస్తూ గొల్లపల్లిలో రోడ్డుపై ధాన్యం బస్తాలతో నిరసన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సులోచన, నెన్నెల ఎస్ఐ రామకృష్ణ రైతులను సముదాయించి ఆందోళన విరమింప చేయడానికి...