Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలి

    Author VENKATESH | 15 Jun 2026, 04:48 PM | TELANGANA, నారాయణపేట
    ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలి

    - ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

    - అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక

    - ప్రజావాణికి 20.ఫిర్యాదులు

    ఇవి కూడా చదవండి

    నారాయణపేట జిల్లా, జూన్ 15 (బి వి కే న్యూస్ )

    ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, డి.ఆర్.ఓ.రాజేశ్వరి లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మక్తల్ మున్సిపల్ కమిషనర్ ఎస్సీ హాస్టల్ తనిఖీ చేయాలని ఆదేశించారు. స్కూల్స్, రెసిడెన్షియల్ హాస్టల్, కళాశాల లు ప్రారంభం అయినందున వాటిని తనిఖీ చేయాలన్నారు. ప్రత్యేక అధికారులు ఎంపీడీవోలు పంచాయతీ కార్యదర్శులు ఆహార నాణ్యత పై రిపోర్ట్ ఇవ్వాలన్నారు. సర్ స్టార్ట్ అవుతున్నది న్యూ రోల్ నమోదు తయారు చేయాలన్నారు. బిఎల్ఓ లకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలన్నారు. వీఐపీ లిస్టు తయారు చేయాలని, హౌసింగ్ రివ్యూ నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
    ఈ కార్యక్రమంలో ,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.