ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలి

- ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి - అధికారులను సూచించిన జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక - ప్రజావాణికి 20.ఫిర్యాదులు నారాయణపేట జిల్లా, జూన్ 15 (బి వి కే న్యూస్ ) ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక అధికారులకు సూచించారు. ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను, డి.ఆర్.ఓ.రాజేశ్వరి లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ...