Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వృద్దులు వద్దు _ ఆస్తులు ముద్దు

    Author VENKATESH | 15 Jun 2026, 04:45 PM | EDITORIAL
    వృద్దులు వద్దు _ ఆస్తులు ముద్దు

    ( జూన్ 15 ప్రపంచ వృద్ధుల వేదింపుల అవగాహన దినోత్సవం సందర్భంగా)
    వ్యథాభరితం వృద్ధాప్యం
    జీవన సంధ్యా సమయంలో
    వృద్ధాప్యం అంతులేని ఘర్షణలకు
    ఆవేదనలకు నిలయం
    వృద్ధాప్యం శాపం కాదు
    అది అనుభవాల ఆస్తి
    నైపుణ్యాల నిధి పెద్దరికం నవతరముతో
    నగుబాట్లకు గురౌవుతుంది
    కోటి ఆశలతో
    ఆకాంక్షల లతో కనిపెంచిన
    తల్లితండ్రులకు
    జీవిత మలిదశ లో
    కష్టాలే కానుకలైనాయి
    అవమానాలే అభినందనలైనాయి
    ఈసడింపులే పలకరింపు లైనాయి
    సూటి పోటి మాటలలే
    వారి పాలిట ఆత్మీయ స్పర్శ
    అయ్యింది
    నిరంతరం శ్రమించిన
    త్యాగమూర్తులకు గుక్కెడు
    గంజి‌ మెతుకులు కరువైనాయి
    ఆత్మీయత కరువై
    ఒంటరి తనం ఆస్తి అయ్యింది
    నిరాశే తోడు నీడైంది
    జవసత్వాలు ఉడిగి
    వృ ద్దాప్యపు బోటుకు
    నిరాకరణ నిరాదరణ అనే
    చిల్లులు పడ్డాయి
    కరుణ కరువై
    కాఠిన్యం బరువై
    కష్టాలే శరణ్యమై
    అనారోగ్యమే సంపదై
    కలలన్నీ కన్నీరై
    ఆశలన్నీ ఆవిరై
    జీవితం మలిదశ లో
    ఆపన్న హస్తoకోసం
    ఎదిరిచుస్తున్న వృద్ధులను
    ఆదరిద్దాం
    కనిపించని దైవాలను పూజిస్తు
    కనిపెంచిన ప్రత్యక్ష దైవాలకు
    నరకం చూపిస్తున్న యువతరం
    మారాలి
    వృద్ధుల అనుభవసారాన్ని త్రుణీకరించే
    అనాగరిక అనైతిక పొకడలను
    అరికట్టాలి
    మనిషి అహాన్ని వీడి
    సంపద పై దురాశ వీడి
    ప్రేమ పూర్వక పలకరింపు
    ఆత్మీయ స్పర్శతో
    వృద్ధుల హక్కుల రక్షణ లో
    తరించండి
    వృద్దులు వద్దు
    ఆస్తులే ముద్దు అనే
    వైఖరి యువత విడనాడాలి
    మానవీయ విలువలతో
    సంస్కారం తో "పెద్దరికానికి"
    "పెద్ద పీట"వేయ్యాలి
    వృద్ధులను కంటికి
    రెప్పలా కాపాడుకోవాలి

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    సాజిక ఆర్థిక అధ్యయన వేదిక
    గ్రా 'కల్లెపల్లి బెజ్జంకి మండలం
    జిల్లా సిద్దిపేట
    9440245771